Don't Miss!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
త్రివిక్రమ్‌ను కలిసిన రష్మిక మందన్నా: హస్తినకు పయనం అయ్యేందుకేనని అంటున్నారే!
గత ఏడాది ఆరంభంలోనే అల్లు అర్జున్‌తో 'అల.. వైకుంఠపురములో' అనే సినిమాతో ముందుకొచ్చాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దీని తర్వాత ఆయన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. దీనికి సంబంధించిన ప్రకటన ఎప్పుడో వెలువడినప్పటికీ.. ఈ మూవీ మాత్రం ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు. అంతేకాదు, ఎప్పుడు మొదలవుతుందో అన్న దానిపై కూడా క్లారిటీ రావడం లేదు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్లో హైలైట్ అవుతోంది.
ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమా గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ గ్రౌండ్ వర్క్ చేస్తునట్లు గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నాతో చర్చలు జరిపారని తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం సమయంలో హారిక హాసినీ కార్యాలయంలో వీళ్లిద్దరి మధ్య కథా పరమైన చర్చలు జరిగినట్లు సమాచారం. దాదాపు రెండు గంటల పాటు ఆమెకు కథను వినిపించాడట మాటల మాంత్రికుడు. ఇది ఆమెకు బాగా నచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ సినిమాలో నటించేందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.
'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి 'అయిననూ పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో తారక్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కనిపించనున్నాడని అంటున్నారు. అలాగే, ఈ సినిమా కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నట్లు, సునీల్ విలన్‌గా నటిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.