రష్మికకు వేణు స్వామి అలాంటి పూజ చేశాడా? వివాదంలో నేషనల్ క్రష్!
సినీ, రాజకీయ రంగాల్లో ప్రముఖ జ్యోతిష్కుడిగా రాణిస్తున్న వేణుస్వామి ప్రస్తుతం అత్యంత వివాదాస్పద అంశాల్లో కూరుకుపోయారు. ఇప్పటి వరకు వివాదాస్పదంగా ఎంతో మంది సినీ ప్రముఖుల జాతకాలతో సంచలన కామెంట్లు చేసిన ఈయన మెడ చుట్టూ ప్రస్తుతం అనేక కాంట్రవర్సీలు చుట్టుకొంటున్నాయి. అయితే తాజాగా నాగచైతన్య, శోభితా ధూళిపాల నిశ్చితార్థం తర్వాత ఈయన చేసిన జాతక ప్రకటన సంచలనం రేపింది. ఈ క్రమంలో రష్మిక మందన్నను లాగుతూ మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ వివాదాల వివరాల్లోకి వెళితే..
గతంలో వేణుస్వామి చెప్పిన జాతకాలు కొన్ని వాస్తవ రూపం దాల్చగా.. మరి కొన్ని అత్యంత దారుణంగా ఫెయిల్ అయ్యాయి. ఇక సమంత, నాగచైతన్య విడిపోతారంటూ చెప్పిన జాతకం నిజం కావడంతో ఆయనకు భారీ క్రేజ్ లభించింది. అయితే వైఎస్ జగన్ గెలుస్తాడని ఆయన చెప్పిన జాతకం బెడిసి కొట్టింది.

ఇక తాజాగా నాగచైతన్య, శోభిత ధూళిపాల జాతకం చెబుతూ.. వారిద్దరూ త్వరలోనే విడిపోతారు. వారిద్దరి డైవోర్స్‌కు కారణం మరో మహిళ కారణం అవుతుంది అంటూ బాంబు పేల్చారు. పెళ్లికి ముందే ఇలాంటి వివాదాస్పద జాతకం చెప్పడంతో నెటిజన్లు, మీడియా నుంచి భారీగా వ్యతిరేకత వచ్చింది. దాంతో మీడియా సంఘాలు ఆయనపై మహిళా కమిషన్‌లో ఫిర్యాుదు చేయడం.. ఆ సంస్థ ఆయనకు నోటీసులు జారీ చేయడం కూడా తెలిసిందే.
అయితే తమపై ఫిర్యాదు చేసిన మీడియా సంఘాలను, ప్రముఖ మీడియా ప్రతినిధిని టార్గెట్ చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు. ఓ మీడియాకు చెందిన కొందరు తమను 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. మాకు అంత స్తోమత లేదు. మాకు ఆత్మహత్యే శరణ్యమని వీడియోలో సంచలనం రేపారు.

అయితే వేణుస్వామి, ఆయన భార్య వీణా ఆరోపణలపై సదరు మీడియా ఛానెల్స్ ప్రతినిధులు సవాల్ విసరడమే కాకుండా ఆయన అవాస్తవ, అసత్య జ్యోతిష్యాలను బయటపెట్టారు. రష్మిక మందన్నకు చేసిన పూజల గురించి బట్టబయలు చేశారు. ఆయనకు పూజలు, క్రతువులు, యాగాలు చేయడం రాదు. ఆయనకు వేద మంత్రాలు వల్లించడం కూడా తెలియదు అంటూ రష్మిక మందన్నకు పూజలు చేస్తున్న వీడియోను బయటపెట్టారు.
రష్మిక మందన్నకు రాజ శ్యామల యాగం చేసిన తర్వాత ఆమెకు ఆశీర్వాదం ఇస్తున్న తీరును టీవీ 5 మీడియా ప్రతినిధి మూర్తి తప్పు పట్టారు. ఆయనకు మంత్రాలు కూడా చదవడం రాదు. సంప్రోక్షన బదులు, తలపై తమలపాకుతో నీళ్లు ధారగా పోస్తున్నాడు. అది తప్పు అంటూ విమర్శించారు. ఇలా మీడియా, వేణుస్వామి మధ్య రష్మిక మందన్న ఇరుక్కొన్నారనే విషయం చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











