Rashmika Mandanna: మేకప్ లేకుండా రష్మిక మందన్నను ఎప్పుడైనా చూశారా? షాకింగ్ లుక్‌తో నేషనల్ క్రష్!
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఛలో సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ క్యూట్ బ్యూటీ తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండతో కలిసి చేసిన గోత గీవిందం సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాధించుకుంది. ఆ సినిమా చేసిన తర్వాత నుంచి రష్మిక స్థాయే మారిపోయింది. పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన అవకాశం దక్కించుకుని అదిరిపోయే చిత్రాల్లో నటించింది. సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, వారసుడు... ఇలా అద్భుతమైన చిత్రాలతో నటించి తన గ్రాఫ్ ను అమాంతం పెంచేసుకుంది.
తాజాగా ఈ క్యూట్ బ్యూటీ రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ విడుదల అయింది. అందులో తెలుగు అమ్మాయిలా రష్మిక చాలా అందంగా కనిపిస్తూనే... రణబీర్ కపూర్ తో విపరీతమైన రొమాన్స్ చేసింది. సాంగ్ అంతా రొమాన్స్, లిప్ లాక్ లే ఉండగా అంతా తెగ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ పాటకు అభిమానుల నుంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఖుషీ అయిన రష్మిక మందన్నా ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేసింది.

అమ్మాయి అంటూ సాగే పాటను పోస్ట్ చేస్తూ... ఈ పాట మీ అందరికీ నచ్చిందా అంటూ అభిమానులను ప్రశ్నించింది రష్మిక మందన్నా. అయితే రష్మిక షేర్ చేసిన ఈ పాటలో ఆమె అసలు మేకప్ యే వేసుకోలేదట. మేకప్ లేకుండానే ఈ వీడియో సాంగ్ లో నటించిందట. మేకప్ లేకపోయినా రష్మిక చాలా అందంగా కనిపిస్తోంది. తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ.. ముఖ్యంగా తెలుపు రంగు చీరలో రష్మిక మందన్నా లుక్ అదిరిపోయింది. ఆమె మేకప్ లేకుండానే ఈ పాటలో నటించిందని ఎవరైనా చెప్పేవరకు ఎవరూ గుర్తు పట్టరు. అంత అదంగా కనిపిస్తోందీ క్యూట్ బ్యూటీ.
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నమోదు అయ్యాయి. అలాగే యానిమల్ సినిమా గ్లింప్స్, ఫస్ట్ సాంగ్ ఇలా ఏది చూసినా అర్జున్ రెడ్డి సినిమానే గుర్తుకు వస్తోంది. సందీప్ రెడ్డి వంగా తీసే ప్రతీ చిత్రంలోనూ ఆయన మార్క్ కనిపించేలా చూసుకుంటున్నారు. "హువా మే".. అంటూ సాగే ఈ పాటలో రష్మిక మందన్నా, రణబీర్ కపూర్ పెయిర్ చాలా క్యూట్ గా ఉందంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇటు తెలుగుతో పాటు అంటు హిందీ భాషలోనూ ఈ పాటకు పాపులారిటీ లభిస్తోంది.

భద్రకాళి ఫిలిమ్స్, టీ సిరీస్ సంస్థలపై ప్రణయ్ రెడ్డి వంగ, భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని... డిసెంబర్ ఒకటో తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ సీయనిర్ నటుడు అనిల్ కపూర్.. రణబీర్ కపూర్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. బాబీ డియోల్ విలన్ రోల్ లో కనిపించనున్నారు. మరి చూడాలి సినిమా ఏ రేంజ్ లో హిట్టు కొడుతుందో.


Click it and Unblock the Notifications











