Rashmika Mandanna Net Worth: రష్మిక నికర ఆస్తులు ఎంతో తెలుసా? విజయ్‌తో పెళ్లికి ముందు ఎన్ని కోట్లంటే?
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏమిటంటే? నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మ్యారేజ్ విషయమే. ప్రస్తుతం జాతీయ మీడియాతోపాటు లోకల్ మీడియా ఈ ఇద్దరి వివాహంపై దృష్టిపెట్టింది. అయితే అత్యంత గోప్యంగా సాగుతున్న పెళ్లి వ్యవహారాలు, కార్యక్రమాలపై కూపీ లాంగేందుకు మీడియా తంటాలుపడుతున్నది. అయితే విజయ్ దేవరకొండ మాత్రం తన మ్యారేజ్‌కు సంబంధించిన విషయాలపై పెదవి విప్పకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే టాప్ స్టార్స్ వివాహం నేపథ్యంలో వారిద్దరిలో ఎవరి సంపాదన ఎక్కువ అనే డిబేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్నది. ఆమె నికర ఆస్తుల విలువ గురించిన వివరాల్లోకి వెళితే..
రష్మిక మందన్న కెరీర్ విషయానికి వస్తే.. 2016 సంవత్సరంలో కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ సినిమా పరిశ్రమకు పరిచచయమయ్యారు. ఆ తర్వాత అంజనీపుత్రతో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఛలో సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆ మూవీ హిట్ కావడంతో అవకాశాలు వరుసగా వెతుక్కొంటూ వచ్చాయి. విజయ్ దేవరకొండత కలిసి గీతా గోవిందం సినిమాలో నటించింది. అప్పటి నుంచే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని చెప్పుకొంటారు. అనంతరం వారిద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ సినిమాలో నటించారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి నటించలేదనే విషయం తెలిసిందే.

మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన తర్వాత రష్మిక రేంజ్ పెరిగింది. ఆ తర్వాత వచ్చిన పుష్ప మూవీతో నేషనల్ క్రష్‌గా మారింది. ఆ తర్వాత హిందీలో కొన్ని సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు. అయితే సందీప్ రెడ్డి వంగా సినిమా యానిమల్‌తో ఆమె క్రేజ్ ఊహించని విధంగా మారిపోయింది. ఆ తర్వాత పుష్ప 2, ఛావా చిత్రాలు సుమారుగా 1000 కోట్లకుపైగా వసూళ్లను సాధించడం ఆమె కెరీర్ గ్రాఫ్ రివ్వున పైకి ఎగిసింది. ఆ తర్వాత కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు హిట్ కావడంతో ఆమె వరుస సక్సెస్‌లతో దూసుకెళ్లింది.
ఇక ప్రస్తుతం బాలీవుడ్‌లోను, సౌత్‌లోను అత్యధిక పారితోషికం తీసుకొనే హీరోయిన్లలో రష్మిక మందన్న పేరు టాప్ లిస్టులో ఉంది అని ట్రేడ్ వర్గాలు చెప్పుకొంటారు. ఆమె సినిమాను బట్టి, బడ్జెట్‌ను బట్టి 10 కోట్ల నుంచి 15 కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకొంటారనేది టాక్. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ల కంటే అధికంగా రెమ్యునరేషన్ తీసుకోవడం ఆమె ప్రతిభకు పట్టమనే చెప్పాలి.
ప్రస్తుతం సక్సెస్ జోరు కొనసాగిస్తున్న రష్మిక మందన్న నికర ఆస్తుల విలువగా భారీగానే పెరిగింది. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, సోషల్ మీడియా ప్రమోషన్స్, ప్రైవేట్ కార్యక్రమాలు ద్వారా భారీగా ఆదాయాన్ని కూడగట్టుకొంటున్నారు. తాజా ఫోర్బ్స్ గణాంకల ప్రకారం.. రష్మిక నికర ఆస్తుల విలువ 9 మిలియన్ డాలర్లు అంటే సమారుగా 80 కోట్ల రూపాయల మేర ఉంటుందని అంచనా వేశారు. అయితే ఆమె ఆదాయంతో పోల్చుకొంటే విజయ్ దేవరకొండ నికర సంపద తక్కువే అని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా, రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత ప్రైవేట్ కార్యక్రమంగా ఫిబ్రవరి 26వ తేదీన జరుపుకొనేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెళ్లి తర్వాత వారి రిసెప్షన్ మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో జరుగుతుంది.


Click it and Unblock the Notifications











