సరిలేరు టీజర్.. అందుకే ఆమెను చూపించలేదా?
సరిలేరు నీకెవ్వరు టీజర్ కాసేపటి క్రితమే విడుదలైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత అనిల్ రావిపూడి లాంటి మీడియం రేంజ్ డైరెక్టర్‌కు చాన్స్ ఇవ్వడంతో ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందారు. అయితే వారందరి అనుమానాలు పటా పంచలు చేస్తూ మహేష్ పోస్టర్స్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తూ వచ్చాడు. తాజాగా టీజర్‌తో మహేష్ ఫ్యాన్స్‌నే కాకుండా సగటు సినీ ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాడు.
మహేష్ చెప్పిన డైలాగ్‌లు, యాక్షన్ సీన్స్, మహేష్ యాటిట్యూడ్, డిఫరెంట్ డైలాగ్ డెలివరీ ఇలా ప్రతీ ఒక్కటి హైలెట్ అయ్యాయి. ఇంకా ఈ టీజర్‌లో కీలక పాత్రలైనా విజయశాంతి, ప్రకాశ్ రాజ్ లాంటి వారిపై అదిరిపోయే షాట్‌లను పెట్టాడు. అందులోనూ వీరిద్దరు చెప్పిన డైలాగ్‌లు ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ మధ్యలో అందరికీ ఓ అనుమానం వస్తోంది.

టీజర్‌లో హీరోయిన్ గురించి ఓ షాట్ కూడా లేదని ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. రష్మీక మందాన్నకు సంబంధించిన ఏ విషయం కూడా చెప్పలేదని ఆమె ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. రష్మీక పాత్రకు అంత ప్రాముఖ్యం ఉండదని, అందుకే టీజర్‌లో కూడా చోటు ఇవ్వలేదని, ముఖ్య పాత్రలైన ఆ ముగ్గురి మీదే ఫోకస్ పెట్టారని టాక్ నడుస్తోంది. రష్మిక, మహేష్‌లకు సంబంధించిన ప్రత్యేకంగా ఏదైనా కట్ చేసి స్పెషల్ ట్రీట్ ఇస్తారేమో చూడాలి మరి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











