రష్మిక మందన్నకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్.. కళ్లు చెదిరేలా సమంత, నయనతార రేంజ్‌లో..
కన్నడంలో యువతారగా మొదలుపెట్టిన రష్మిక మందన్న ఇప్పుడు టాలీవుడ్‌లో అగ్రతార స్థాయికి ఎదిగింది. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్లతోను.. అలాగే నాగశౌర్య, విజయదేవరకొండ లాంటి యువ హీరోలతో కూడా నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇప్పుడు తెలుగు హీరోలకు లక్కి మస్కట్‌గా ఆమె మారిపోయింది. అయితే లాక్‌డౌన్ తర్వాత రష్మిక తీసుకొంటున్న రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఆమె రెమ్యునరేషన్ ఎంతంటే..
Recommended Video

కన్నడలో చాలా తక్కువగా
కన్నడలో తన మాజీ ప్రియుడు రక్షిత్ షెట్టి నిర్మాతగా మారి హీరోగా నటించిన కిరిక్ పార్టీ చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత అంజనీపుత్ర, ఛమకల్ చిత్రాల్లో నటించింది. అయితే ఈ మూడు సినిమాలు విజయవంతమైనప్పటికి.. ఆమె అందుకొన్నది కేవలం లక్షల్లోనే అని సినీ వర్గాలు వెల్లడించాయి.

గీతా గోవిందంతో టాప్ రేంజ్‌కు
ఛలో సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన రష్మిక ఆ తర్వాత వెనుకకు తిరిగి చూసుకోలేదు. గీతా గోవిందం, దేవదాస్ చిత్రాల విజయంతో తన స్థాయిని మరో లెవెల్‌కు పెంచుకొన్నారు. ఇక భీష్మ, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో టాప్ రేంజ్‌కు చేరుకొన్నారు. దీంతో ఇప్పుడు హీరోల చూపంతా రష్మికపైనే పడింది.

సరిలేరు నీకెవ్వరు తర్వాత అగ్ర తారగా
గీత గోవిందం చిత్రం తర్వాత భారీగా తన రెమ్యునరేషన్ స్థాయిని పెంచింది. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత దక్షిణాదిలో అగ్రతారగా ముద్రవేసుకొన్నది. ఆ తర్వాత ఆమె సినిమాలకు క్రేజ్ మాత్రమే కాకుండా మంచి పాపులారిటీ కూడా లభించింది. దాంతో తన పారితోషికాన్ని రెండింతలు పెంచింది.

దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకొనే తారగా
ప్రస్తుతం దక్షిణాదిలో భారీ రెమ్యునరేషన్ అందుకొంటున్న హీరోయిన్లలో సమంత అక్కినేని, నయనతార, అనుష్క పేర్లు ప్రధానంగా వినిపిస్తాయి. ఇప్పుడు వరుస హిట్లను ఖాతాలో వేసుకొంటున్న రష్మిక మందన్న కూడా ఆ రేంజ్ జాబితాలో చేరినట్టు వినిపిస్తున్నది. ఇప్పుడు సుమారు రూ.2 కోట్ల మేర పారితోషికాన్ని అందుకొంటున్నట్టు అనధికార సమాచారం. ఇటీవల ఓ నిర్మాత భారీగా ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది.

అల్లు అర్జున్, శర్వానంద్‌తో రష్మిక మందన్న
ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత రష్మిక ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. అలాగే శర్వానంద్ నటిస్తున్న ఆడాళ్ళూ మీకు జోహార్లు చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇంకా కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











