ఆయనవన్నీ నాకే సొంతం.. విజయ్ దేవరకొండతో రిలేషన్‌పై తేల్చేసిన రష్మిక
సినీ పరిశ్రమలో నటీనటుల మధ్య ప్రేమలు, ఎఫైర్లు, పెళ్లిళ్లు ఈనాటివి కాదు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఎందరో నటీనటులు ప్రేమలో పడ్డారు.. పెళ్లిళ్లు చేసుకున్నారు. కొన్ని కథలు పెళ్లి పీటల వరకు చేరకుండానే అర్ధాంతరంగా ఆగిపోయాయి. ప్రస్తుతం తరంలోనూ ఎందరో స్టార్స్ తమ సహ నటులతో ప్రేమలో పడుతున్నారు. ఫలానా వారి మధ్య ఏదో నడుస్తోందని మీడియాలో కథనాలు వస్తుండగా వీరు మాత్రం కనీసం స్పందించరు. ఈ కోవలోకే వస్తారు విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న.
గీత గోవిందంలో తొలిసారి జంటగా
పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం సినిమాలో తొలిసారి వీరిద్దరూ కలిసి నటించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో వీరి కెమెస్ట్రీ అదిరిపోయింది. ఈ జంటకు ప్రేక్షకులు జేజేలు పలకడంతో గీత గోవిందం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఇద్దరూ కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నాటి నుంచి విజయ్ - రష్మికలు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. వీరి కాంబోలో తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ డిజాస్టర్‌గా నిలిచింది. అటు తర్వాత అర్జున్ రెడ్డితో ఇండస్ట్రీని షేక్ చేశాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయిన విజయ్.. యూత్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు.

విజయ్‌తో రష్మిక చెట్టాపట్టాల్
రష్మిక బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతూ బాలీవుడ్‌లో అడుగుపెట్టి యానిమల్, ఛావా, పుష్ప 2 సినిమాలతో నేషనల్ క్రష్‌గా ఎదిగింది. అయితే గత కొన్నేళ్లు ఈ ఇద్దరి గురించి మీడియాలో, సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్. విజయ్‌తో రష్మిక పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోందని చిత్రసీమలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు వీరిద్దరూ కలిసి పబ్లిక్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని.. వెకేషన్స్‌కి సీక్రెట్‌గా వెళ్తున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. మాల్దీవుల టూర్‌తో పాటు ఎయిర్‌పోర్టులు, రెస్టారెంట్స్‌లలో విజయ్ దేవరకొండ- రష్మికలు ఉన్న ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతుండటంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది.
విజయ్ ఇంట్లో రష్మిక
విజయ్ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా రష్మిక ప్రత్యక్షం కావడం.. దీపావళి వేడుకలు, ఆ ఫ్యామిలీతో క్లోజ్‌గా ఉండటం.. ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా ఈవెంట్‌లకు రష్మిక చీఫ్ గెస్ట్‌గా వెళ్లడం వంటి పరిణామాలు అటు ప్రేక్షకులను, ఇటు సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం విజయ్‌తో తన రిలేషన్‌పై ఓపెన్‌గా హింట్ ఇచ్చేసింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ వివరాల్లోకి వెళితే..
జూన్ 20న కుబేర రిలీజ్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కీలకపాత్రలు పోషించిన చిత్రం కుబేరా. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఎప్పుడు సినిమా ఈవెంట్ జరిగినా నటీనటులను సరదాగా ఇంటర్వ్యూ చేస్తూ ఆటపట్టించే స్టార్ యాంకర్ సుమ.. ఈ కార్యక్రమంలోనూ రష్మికను సరదాగా ఇంటర్వ్యూ చేసింది. కొందరు హీరోల పేర్లు చెప్పి.. వాళ్ల నుంచి మీకు ఏం కావాలని ప్రశ్నించింది. అల్లు అర్జున్ నుంచి స్వాగ్, నాగార్జున నుంచి ఛార్మింగ్, ధనుష్ నుంచి ఎండలో పనిచేయగల సామర్ధ్యం కావాలని చెప్పింది రష్మిక.
విజయ్ నుంచి అన్నీ కావాలి
ఆ వెంటనే విజయ్ దేవరకొండ పేరును సుమ ఎత్తగానే ఆడిటోరియం మొత్తం ఈలలు, కేకలతో దద్ధరిల్లిపోయింది. రష్మిక కూడా సిగ్గుతో మెలికలు తిరిగింది. విజయ్ నుంచి ఏం కావాలని సుమ అడగ్గా.. ఆయన నుంచి మాత్రం అన్నీ కావాలని ఏమాత్రం తడుముకోకుండా ఆన్సర్ ఇచ్చింది రష్మిక మందన్న. దీంతో విజయ్‌తో తన రిలేషన్‌ను, ఆయనపై ఉన్న ప్రేమను పరోక్షంగా ఆమె బయటపెట్టిందంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











