రాత్రి 9 గంటలు దాటితే ఆ టెన్షన్ మొదలవుతుంది.. రష్మిక షాకింగ్ కామెంట్స్!

కర్ణాటకలోని ఎక్కడో మారు మూల ప్రాంతంలో పుట్టి నేషనల్ క్రష్‌గా ఎదిగారు కన్నడ కస్తూరి రష్మిక మందన్న. విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలిగా మారిపోయారు. అగ్రనటిగా, దక్షిణాదిలో అత్యధిక పారితోషికం అందుకునే నటిగా రష్మిక వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. పెళ్లి హడావుడి ముగియడంతో తిరిగి సినిమాలపై దృష్టి పెట్టారు నేషనల్ క్రష్. ఆమె నటించిన కాక్ టెయిల్ 2 త్వరలోనే విడుదల కానుంది.

మోడలింగ్ నుంచి సినీరంగం వైపు అడుగులు వేసిన రష్మిక తొలుత 2014లో టైమ్స్ ఆఫ్ ఇండియా క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ అవార్డ్‌ అందుకున్నారు. 2015లో కన్నడ సూపర్‌స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కిర్రాక్ పార్టీలో రక్షిత్ శెట్టి సరసన నటించారు రష్మిక. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు రష్మికకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అంజనీ పుత్ర, చమక్ చిత్రాలలో నటించారు.

Rashmika Mandanna Opens Up About Trolling and how to handle Social Media Pressure

ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రష్మికకు పిలుపొచ్చింది. ఛలో మూవీ ద్వారా ఆమె టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత గీతా గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మతో వరుస హిట్స్ అందుకున్న రష్మిక కెరీర్‌ను పుష్ప సిరీస్ ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమాలో శ్రీవల్లిగా జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు రష్మిక. అనంతరం యానిమల్, ఛావా, సికందర్, కుబేరా, థామా, ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రాలతో నేషనల్ క్రష్‌గా అవతరించారు రష్మిక. అత్యధిక సక్సెస్ రేట్‌తో బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఆమె దరిదాపుల్లో లేరంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం హిందీలో కాక్‌టెయిల్, తెలుగులో మైసా సినిమాలో రష్మిక నటిస్తున్నారు.

అందరు హీరోయిన్ల మాదిరిగానే రష్మికపైనా ఎన్నో రూమర్స్, ట్రోలింగ్ జరిగింది. వీటిని చాలాకాలం పట్టించుకోని ఈ ముద్దుగుమ్మ.. ఓ రోజున మాత్రం మండిపడ్డారు. కొన్నేళ్లుగా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.. కెరీర్ స్టార్ట్ చేసిన నాటిన నుంచి సోషల్ మీడియాలో ద్వేషానికి గురవుతున్నాను, ఇప్పటికీ అవి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్లంతా మీకు నచ్చాలని లేదు.. నచ్చపోతే నచ్చలేదని చెప్పేయండి అంతేకానీ ఇలా ట్రోల్ చేయొద్దని రష్మిక వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ ఆమెపై ట్రోలింగ్ ఏమాత్రం ఆగలేదు.

గతేడాది ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ప్రమోషన్‌లో భాగంగా యాంకర్ సుమ నిర్వహించిన ఛాట్ షోకి దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో కలిసి హాజరయ్యారు రష్మిక. ఈ సందర్భంగా తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి ఆవేదన వ్యక్తం చేశారు. సుమ మాట్లాడుతూ.. నా కొడుకు సినిమాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు, కానీ సినిమాల కంటే ముందు సోషల్ మీడియాని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోమని చెబుతాను. ఓ వైపు రష్మికకు సినిమాలు, హిట్స్, కోట్లు ఇన్ని ఆనందాలు ఉంటాయి.. మరోవైపు సడెన్‌గా చూస్తే మనకి 10 పాజిటివ్ కామెంట్స్ ఉంటే ఒక్క నెగిటివ్ కామెంట్‌లో విపరీతంగా మనల్ని లాగేస్తారని సుమ చెప్పారు.

రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. ఈవెంట్ అవ్వగానే ఇంటికెళ్లి పడుకున్నా. మా అమ్మకి 4.30కి ఫ్లైట్ ఉండటంతో నిద్రపోకుండా సోషల్ మీడియాలో అందరికీ రిప్లయ్ ఇస్తున్నాను. ఈవెంట్‌లో విజయ్ స్పీచ్, రష్మిక వైబ్ అదిరిపోయింది. అంతా బాగా జరిగిందని ఆనందించేలోగా ఒక ట్వీట్ నా ఫేస్‌లో కలను లాగేసింది. నేను ఎంతో మెచ్యూర్డ్ అయినా, ఇంత అనుభవం ఉన్నా.. ఆ ఒక్క ట్వీట్ నన్ను బాధపెట్టిందని చెప్పారు. అందుకే నేను కామెంట్స్ చెక్ చేయకుండా నాకు నేను రూల్ పెట్టుకున్నానని సుమ చెప్పింది. 10 కామెంట్స్ చదవగానే ఇంకాస్త కిందకి వెళ్లాలనిపిస్తుంది. అలా కిందకి వెళ్లగానే ఒక కామెంట్ మూడ్ మొత్తం మార్చేస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే యాక్టర్స్‌కి, టెక్నీషియన్స్‌కి రూల్ నెంబర్ వన్ ఏంటంటే రాత్రి 9 గంటల తర్వాత ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌ని, ట్విట్టర్‌ని ఓపెన్ చేయొద్దని సుమ సూచించింది.

రష్మిక మాట్లాడుతూ.. నేను సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటా, సినిమాలు రిలీజైనప్పుడు దూరంగానే ఉండేదానిని. సినిమాలలో ఎత్తుపల్లాలు నా చేతుల్లో లేవు. నా సినిమాలు రిలీజైనప్పుడు రోజంతా చాలా బాగుండేది, కానీ రాత్రి 9 గంటలు అయిన తర్వాత ఏదేదో అయిపోతుంది. రోజంతా బాగుంటారు కదారా, సడెన్‌గా ఏమైందిరా మీకు అనిపిస్తుందని రష్మిక చెప్పింది. అందుకే బ్యాడ్ కామెంట్ కానీ, బ్యాడ్ వీడియో కానీ చూసినా గ్రూప్‌లో క్రియేట్ చేయొద్దని సుమ సలహా ఇచ్చింది. ప్రస్తుతం రష్మిక మందన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: rashmika mandanna suma kanakala
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X