డేటింగ్ అతడితో..పెళ్లి విజయ్‌తో.. ఎట్టకేలకు ఓపెన్ అయిన రష్మిక
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతుంది రష్మిక మందన్న (Rashmika Mandanna). ఈ అమ్మడు ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత బిజీగా మారింది. స్టార్ హీరోలతో భారీ కమర్షియల్ సినిమాలు చేస్తూనే, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లోనూ తన ప్రతిభను నిరూపిస్తూ దూసుకెళ్తున్నారు. తాజాగా 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రష్మిక తాజాగా విద్యార్థులతో చిట్‌చాట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆమె తన సినీ జర్నీ, వ్యక్తిగత అనుభవాలు, అలాగే విజయ్ దేవరకొండపై వస్తున్న రూమర్స్ గురించి ఒపెన్ గా మాట్లాడారు. ఆమె ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రష్మిక మందాన ఇటీవల ఒక విద్యార్థులతో చిట్ చాట్ లో పాల్గొంది. ఈ సమయంలో ఓ విద్యార్థి "మీ గురించి ఉన్న నిజమైన రూమర్ ఏంటి?" అని అడగగా రష్మిక నవ్వుతూ, "నేను ఏమి చెప్పగలను? మీ అందరికీ బాగా తెలుసు!" అంటూ ఫన్నీ రిప్లే ఇచ్చింది. ఈ సమాధానం అక్కడున్న వారిలో కొత్త జోష్ ను తీసుకవచ్చింది. అయితే అభిమానులు మాత్రం ఈ సమాధానం విజయ్ దేవరకొండను సూచిస్తూ చెప్పిందని అర్థం చేసుకున్నారు. గత కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య సన్నిహిత బంధం ఉందని, పెళ్లి పుకార్లు వస్తూనే ఉన్నాయని తెలిసిందే.

తన జీవిత భాగస్వామి గురించి అడిగినప్పుడు రష్మిక చాలా భావోద్వేగంగా స్పందించారు. ఆమె మాట్లాడుతూ, "ప్రపంచం మొత్తం నా వ్యతిరేకంగా ఉన్నా కూడా నా కోసం నిలబడే వ్యక్తి కావాలి. నన్ను లోతుగా అర్థం చేసుకునే, నా దృష్టితో ఆలోచించే మనిషి కావాలి. అన్ని పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి నాకిష్టం. నిజమైన వ్యక్తిత్వం ఉన్నవాడు, నా కోసం యుద్ధం చేయగల వ్యక్తి కావాలి. అలాంటి భాగస్వామి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, అవసరమైతే యుద్ధంలో తూటాకైనా ఎదుర్కొంటాను" అని చెప్పారు. ఆమె ఈ మాటలు అక్కడి వారిని ఇంప్రెస్ చేశాయి.
అదే ఇంటర్వ్యూలో మరో విద్యార్థి "మీరు ఎవరితో డేట్ చేయాలనుకుంటారు? ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు?" అని అడగగా, రష్మిక నవ్వుతూ "డేట్ అయితే యానిమేషన్ క్యారెక్టర్ నరుటో (Naruto) తో చేస్తా, ఎందుకంటే ఆ పాత్ర నాకు చాలా ఇష్టం. కానీ పెళ్లి మాత్రం విజయ్ (Vijay Deverakonda)తో" అని చెప్పడంతో అక్కడ ఉన్నవారు కేరింతలు కొట్టారు. "కంగ్రాట్స్ రష్మిక!" అంటూ విద్యార్థులు అరిచారు, దానికి ఆమె చిరునవ్వుతో "థాంక్యూ!" అని స్పందించారు. ఈ సమాధానం సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారి, "రష్మిక ఎట్టకేలకు అంగీకరించింది" అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
నరుటో ఎవరు అనే సందేహం కొందరికి కలిగింది. అసలు ఆయన జపనీస్ యానిమేటెడ్ సిరీస్ 'Naruto'లో టైటిల్ రోల్ పోషించిన హీరో. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్‌కు విపరీతమైన అభిమానులు ఉన్నారు. రష్మిక కూడా నరుటో పెద్ద ఫ్యాన్ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ముందే తెలిపింది. "ఒకవేళ అవకాశం వస్తే నరుటో పక్కన ప్రేయసిగా నటిస్తా" అని చెప్పిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక రష్మిక, విజయ్ దేవరకొండల మధ్య ఉన్న స్నేహం చాలా కాలంగా అభిమానుల్లో చర్చనీయాంశం. ఇటీవల అక్టోబర్ 3న వీరి నిశ్చితార్థం జరిగిందని పలు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై రష్మికను ప్రశ్నించగా ఆమె పరోక్షంగా స్పందిస్తూ, "మీరు ఏం అనుకుంటున్నారో అదే నిజం. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతా " అని చెప్పింది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో "పెళ్లి విజయ్‌తో " అని రష్మిక బహిరంగంగా చెప్పడంతో, అభిమానులు "ఇదే అఫీషియల్ " అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











