ఆ భయాన్ని జయించా.. రష్మిక ఎమోషనల్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ కన్నడ ముద్దగుమ్మ అందం,అభినయంతో తెలుగు సినిమాలతో వరుస విషయాలు అందుకుని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారింది. పాన్ ఇండియా లెవల్లో ఫుల్ జోష్ మీదున్న హీరోయిన్ రష్మిక.. తెలుగు, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇటీవలే 'ది గర్ల్ ఫ్రెండ్' తో థియేటర్లలో సందడి చేసిన ఈ అమ్మడు.. మరో పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులతో ముందుకు రానున్నది. అయితే.. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇంతకీ ఏం అన్నారంటే?

నేషనల్ క్రాష్ రష్మిక మందన్న మరోసారి తన డెడికేషన్‌తో వార్తల్లో నిలిచింది. లేడీ ఓరియెంటెడ్ పాన్ ఇండియా చిత్రం 'మైసా' కోసం ఆమె పడుతున్న కష్టం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించనుంది. కోచిలో షూటింగ్ జరుగుతున్న సమయంలో తనకు ఉన్న హైట్స్ ఫియర్‌ను ఎదుర్కొన్నట్లు రష్మిక సోషల్ మీడియాలో కనిపించింది. "అడవులు, కీటకాలు, జలపాతాలు, ట్రెక్కింగ్, వర్కౌట్స్, వర్షాలు.. ఇలా ప్రతి రోజు ఒక కొత్త అనుభవం. ముఖ్యంగా ఎత్తులంటే నాకు చాలా భయం.. కానీ ఇక్కడ దాన్ని జయించాను" అంటూ చెప్పింది.

Rashmika Mandanna Overcomes Fear of Heights for Mysaa Sets Global Ad Records

అంతేకాదు యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం కఠినమైన శిక్షణ తీసుకున్నానని, షూటింగ్ సమయంలో మోకాళ్లు, కాళ్లకు గాయాలైనా ఆపకుండా పని కొనసాగించానని తెలిపింది. ఉదయం అలారం పెట్టుకుని లేవడం నుంచి, కోచిలో ఫేమస్ అయిన పజం పోరి తినడం వరకు ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని రష్మిక తన అనుభవాలను పంచుకుంది. 'మైసా' సినిమా కోసం రష్మిక ఎలాంటి డూప్ లేకుండా దాదాపు 80 అడుగుల ఎత్తు నుంచి దూకినట్లు దర్శకుడు వెల్లడించడం మరింత ఆసక్తి రేపింది. ఈ సీన్ సమయంలో ఆమె చేతులు, కాళ్లకు గాయాలు అయినప్పటికీ షూటింగ్‌ను ఆపకుండా కొనసాగించడం ఆమె ప్రొఫెషనలిజాన్ని చూపుతోంది.

విరోష్ జంట గ్లోబల్ రికార్డ్స్
మరోవైపు రష్మిక-విజయ్ దేవరకొండ జంట సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ జంట కలిసి చేసిన ఎయిర్‌బీఎన్‌బీ యాడ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 9.1 మిలియన్ లైక్స్ సాధించి గ్లోబల్ స్థాయిలో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇది మాత్రమే కాదు, 'మాన్యవర్' యాడ్ ఇప్పటికే 11.5 మిలియన్ లైక్స్‌తో ప్రపంచంలోనే అత్యధిక లైక్స్ సాధించిన యాడ్‌గా నిలిచింది. ఈ పోస్ట్‌కు 100 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం కూడా విశేషం. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ స్టార్స్ లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో ​​రొనాల్డో చేసిన యాడ్స్‌ను కూడా ఈ జంట లైక్స్‌లో దాటేయడం వారి క్రేజ్‌ను చూపుతోంది.

ఈ జంట త్వరలో 'రణబాలి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకవైపు యాక్షన్ రోల్స్‌తో రష్మిక తన రేంజ్ పెంచుకుంటుంటే.. మరోవైపు విరోష్ జోడీ గ్లోబల్ లెవెల్‌లో రికార్డ్స్ సృష్టిస్తోంది. ఇలా 'మైసా' కోసం రష్మిక చేసిన కష్టం, ధైర్యం అభిమానులను ఆకట్టుకుంటుండగా.. ఆమె కొత్త అవతార్‌ను తెరపై చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X