చూడాలని ఉంది.. ఏదో ఒక రోజు రాత్రిపూట ఆ పని చేసేస్తా.. రష్మిక మందన్న
తెలుగు తెరపై యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న హవా నడుస్తోంది. వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటూ అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది ఈ కన్నడ ముద్దుగుమ్మ. ఇటీవలే 'భీష్మ' రూపంలో మరో సక్సెస్ సాధించిన ఈమె.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన ఇష్టాయిష్టాల గురించి మాట్లాడింది. వివరాల్లోకి పోతే..

ఇంకో రెండు సినిమాల తరువాత..
ఛలో అంటూ టాలీవుడ్ గడప తొక్కిన ఈ బ్యూటీ.. తెలుగులో ఇంకో రెండు సినిమాల తరువాత ఇక్కడే ఇల్లు కొనుక్కుంటానని చెబుతోంది. తనకు ఇక్కడే ఉండి పోవాలని అనిపిస్తోందని, హైదరాబాద్ లోనే సెటిలవుతానని ఆమె చెబుతోంది.

ఖాళీ సమయం దొరికిందంటే..
ఇక తన ఖాళీ సమయంలో టీవీ చూస్తూనో, పుస్తకాలు చదువుతూనో ఉంటానని చెప్పిన ఆమె.. తనకు ఎప్పుడైనా కోపం వస్తే షాపింగ్‌కు వెళ్లిపోతానని చెప్పింది. ఇకపోతే సంప్రదాయ దుస్తులే తానకు ఇష్టమని, ఆ దుస్తులు ధరించేందుకే తాను మొగ్గు చూపుతానని చెప్పుకొచ్చింది.

హైదరాబాద్ వచ్చిన కొత్తలో.. రాత్రిపూట వెళ్ళొస్తా
తనకు చార్మినార్ చూడాలని ఎప్పటినుంచో ఉందని కానీ కుదరడం లేదని చెప్పింది రష్మిక. ఏదో ఒక రోజు రాత్రిపూట బురఖా వేసుకుని అయినా అక్కడికి వెళ్లి వస్తానని అంటోంది ఈ బ్యూటీ. హైదరాబాద్ లో ఇంకా గోల్కొండ కోటను కూడా చూడాల్సి ఉందని రష్మిక చెప్పింది. తాను హైదరాబాద్ కు వచ్చిన కొత్తలో బిర్యానీ ఎక్కువగా తినేదాన్నని ఆమె చెప్పుకొచ్చింది.

అంతా అలా అనుకుంటున్నారు
ఇకపోతే తనను అంతా తెలుగు అమ్మాయనే అనుకుంటున్నారని, అంతేకాదు ఈ మధ్య తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నానని రష్మిక మందన్న తెలిపింది. ఒకవేళ సినిమాల్లో అవకాశాలు రాకుంటే, ఫిట్‌నెస్‌కు సంబంధించిన వ్యాపారం చేసుండేదాన్నని ఆమె చెప్పుకొచ్చింది.
Recommended Video


బ్యాక్ టు బ్యాక్ సక్సెస్.. రష్మిక స్పీడ్
బ్యాక్ టు బ్యాక్ సరిలేరు నీకెవ్వరు, భీష్మ సక్సెస్ అందుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


Click it and Unblock the Notifications











