twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాక్ ఆఫ్ ది టౌన్: రష్మిక మందన్నా షాకింగ్ డెసీషన్... ఓ ఇంటిది కాబోతున్న కన్నడ పిల్ల.!

    By Manoj
    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లలో కన్నడ భామ రష్మిక మందన్నా ఒకరు. కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి విజయాలను అందుకున్న ఈమె.. అనతి కాలంలోనే మంచి గుర్తింపును దక్కించుకుంది. అందంతో పాటు అభినయం ఉన్న హీరోయిన్ కావడంతో.. సినిమా ఫలితాలకు సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటోంది. ఇలాంటి తరుణంలో రష్మిక మందన్నా గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఇండస్ట్రీలో ఆమె హాట్ టాపిక్ అవుతోంది. ఆ సంగతులేంటో చూద్దాం.!

    రష్మికకు అదిరిపోయే ఆరంభం

    రష్మికకు అదిరిపోయే ఆరంభం

    రష్మిక మందన్నా 2020 సంవత్సరాన్ని గ్రాండ్‌గా ఓపెన్ చేసింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు'తో పాటు ఇటీవల విడుదలైన ‘భీష్మ'తో ఆమె కెరీర్‌లో వరుస విజయాలు వచ్చి చేరాయి. మహేశ్ సినిమాలో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యం లేకపోయినా.. నితిన్ మూవీలో మాత్రం మరోసారి ఆకట్టుకుంది. దీంతో రష్మిక ఫుల్ ఖుషీగా ఉంది.

    మెగా హీరోతో ఫుల్ రొమాన్స్

    మెగా హీరోతో ఫుల్ రొమాన్స్

    రష్మిక ఒప్పుకున్న సినిమాలన్నీ విడుదల అయిపోయాయి. ప్రస్తుతం ఆమె ఒప్పుకున్న సినిమా మెగా హీరో అల్లు అర్జున్‌తో మాత్రమే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రష్మిక పాత్ర అదిరిపోయేలా డిజైన్ చేశాడట. అంతేకాదు, ఇందులో బన్నీకి ఆమెకు మధ్య బాలీవుడ్‌ రేంజ్‌లో చూపించే రొమాన్స్‌ ఉంటుందని సమాచారం.

    Recommended Video

    Rashmika Mandanna Speech At Bheeshma Pre Release Event || Filmibeat Telugu
    నందమూరి హీరో కన్ను పడింది

    నందమూరి హీరో కన్ను పడింది

    వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న రష్మిక మందన్నాతో సినిమాలు చేయడానికి టాలీవుడ్‌లోని చాలా మంది ఫిల్మ్ మేకర్లు పోటీ పడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే త్వరలో ప్రారంభం కానున్న ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాలోనూ ఆమె అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తారక్.. ఆమెనే ఫైనల్ చేయాలని భావిస్తున్నట్లు టాక్.

    ఓ ఇంటిది కాబోతున్న కన్నడ పిల్ల.!

    ఓ ఇంటిది కాబోతున్న కన్నడ పిల్ల.!

    ఫుల్ ఫామ్‌లో ఉన్న కన్నడ పిల్ల రష్మిక మందన్నా హైదరాబాద్‌లో సెటిల్ అవ్వాలని భావిస్తున్నట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఆమె త్వరలోనే నగరంలో ఓ ఇంటిని కొనబోతున్నట్లు తెలుస్తోంది. వరుస విజయాలు దక్కుతుండడంతో టాలీవుడ్‌లోనే వీలైనన్ని సినిమాలు చేయాలనుకుంటున్న ఈ అమ్మడు.. అందుకే ఇక్కడ ఇల్లు కొనబోతుందని అంటున్నారు.

    ఇలాంటి సమయంలో ఆ నిర్ణయమా.?

    ఇలాంటి సమయంలో ఆ నిర్ణయమా.?

    రష్మిక మందన్నా కర్నాటకకు చెందిన అమ్మాయి అన్న విషయం తెలిసిందే. అక్కడ ఆమె సొంతం నివాసంలో కొద్ది రోజుల క్రితం ఐటీ అధికారులు దాడులు చేశారు. అప్పుడు ఈ న్యూస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇది జరిగి ఎన్నో రోజులు కాకముందే రష్మిక ఇల్లు కొనాలని భావించడం సాహసోపేత నిర్ణయమేనని చాలా మంది చెవులు కొరుక్కుంటున్నారు.

    English summary
    Rashmika Mandanna, is an Indian film actress and model who works predominantly in Telugu and Kannada films. She is popularly dubbed by the media and Kannada film industry as the 'Karnataka Crush'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X