Rashmika Mandanna: వారసుడు ఎఫెక్ట్.. దెబ్బకు దారికొచ్చిన రష్మిక మందన్నా? రిషబ్ శెట్టిపై పాజిటివ్ గా!

కన్నడ సూపర్ హిట్ మూవీ కాంతార దేశవ్యాప్తంగా విడుదలైన తర్వాత ఆ సినిమా హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మధ్య వివాదం రాజుకొంది. రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ఒకిపై మరొకరు మాటల యుద్ధంతో కాంట్రవర్సీకి ఆజ్యం పోశారు. ఈ వివాదం ఇలా ఎంతకాలం కొనసాగుతుంది అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. అయితే తాజాగా రష్మిక మందన్నా చేసిన కామెంట్స్ ఆ వివాదానికి తెర దించేలా ఉన్నాయి. రిషబ్ శెట్టిపై నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా చేసిన కామెంట్స్ ఏంటనే వివరాల్లోకి వెళితే..

కన్నడ సినిమా ద్వారా..

కన్నడ సినిమా ద్వారా..

కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ రష్మిక మందన్నా సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవల నార్త్ సినిమాలు చేస్తూ అక్కడ కూడా తన సత్తా చాటుతోంది. పుష్ప సినిమాతో రష్మిక మందన్నాకు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే మొదట 'కిరిక్ పార్టీ' అనే కన్నడ చిత్రం ద్వారా రష్మిక మందన్నా ఎంట్రీ ఇచ్చింది. కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే అదే భాషల్లో అనేక సినిమాలు చేసింది.

వారసుడుకి మిక్స్ డ్ టాక్..

వారసుడుకి మిక్స్ డ్ టాక్..

ఇక ఇటీవల నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అందులో శ్రీవల్లిగా నటించి యూత్ ను ఫిదా చేసిందనే చెప్పవచ్చు. దీంతో ఆమెకు ఇటు బాలీవుడ్, అటు కోలీవుడ్ లో వరుసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే ఆమె నటించిన హిందీ చిత్రం గుడ్ బై అంతగా ఆకట్టుకోలేదు. అలాగే విజయ్ తో కలిసి నటించిన వారసుడు సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది.

రిషబ్ శెట్టిపై కామెంట్స్..

రిషబ్ శెట్టిపై కామెంట్స్..

ఇప్పుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో రష్మిక మందన్నా జోడీ కట్టిన చిత్రం మిషన్ మజ్ను. శాంతను భగ్చీ దర్శకత్వం వహించిన మిషన్ మజ్ను సినిమా జనవరి 20న నేరుగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తరచుగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాంతార హీరో రిషబ్ శెట్టిపై పాజిటివ్ కామెంట్స్ చేసింది రష్మిక.

నటిగా తొలి అవకాశం..

నటిగా తొలి అవకాశం..

ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా మాట్లాడుతూ.. "నటిగా ఇన్ని భాషల్లో పనిచేసినందుకు.. ప్రేక్షకులు అలరిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నా. ఇప్పటివరకూ కెరీర్ లో నేను మంచి నటీనటులతో కలిసి పని చేశాను. అయితే ఒక నటిగా నేను పరిశ్రమలోకి రావడానికి రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టినే కారణం. వాళ్లే నాకు ఇండస్ట్రీలో దారి చూపించి.. నటిగా తొలి అవకాశాన్ని నాకు అందించారు" అని తెలిపింది.

వారిసుకు ఎదురు దెబ్బ..

వారిసుకు ఎదురు దెబ్బ..

ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో జనవరి 14న విడుదలైన కోలీవడ్ స్టార్ విజయ్-రష్మిక మందన్నా సినిమా మిగతా రాష్ట్రాల్లో జనవరి 11న రిలీజ్ అయింది. అయితే గత కొంతకాలంగా కన్నడ పరిశ్రమలో రష్మికపై నెగెటివ్ ప్రచారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. రష్మికను అక్కడ బ్యాన్ చేశారన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఆమె ప్రవర్తన కారణంగా వారిసుకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందని టాక్ వినిపించింది.

షోలు తగ్గడానికి కారణం..

షోలు తగ్గడానికి కారణం..

కిరిక్ పార్టీ దర్శకుడు, కాంతార హీరో రిషబ్ శెట్టిపై చేసిన రష్మిక మందన్నా వ్యాఖ్యలు కన్నడీగులకు రుచించలేదు. దీంతో వారుసడు సినిమాకు తొలి రోజు 757 షోలు ప్రదర్శించగా.. మరుసటి రోజు 466 షోలకు పడిపోయింది. అంటే దాదాపుగా 300 (291) షోలు తగ్గిపోయాయి. అందుకు కారణం రష్మికనే అని వార్తలు వచ్చాయి. ఈ ఎఫెక్ట్ కారణంగానే ఇప్పుడు రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టిపై రష్మిక మందన్నా పాజిటివ్ గా రియాక్ట్ అయిందని చర్చించుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X