Just In
- 32 min ago
యంగ్ హీరోయిన్‌కు పెళ్లి.. మా ఆయన గొప్ప ప్రేమికుడంటూ పోస్ట్
- 1 hr ago
గొల్లపూడి మరణం : ఆయన రాసిన ఆ నాటిక ఇష్టం.. సినీ పరిశ్రమకు తీరని లోటు.. కోట శ్రీనివాస్ కామెంట్స్
- 2 hrs ago
గొల్లపూడి మరణం : మాది గురుశిష్యుల సంబంధం.. ఆయన ద్వారానే ఆ అవకాశం.. చిరంజీవి స్పందన
- 2 hrs ago
‘సైరా’ సంచలనం: రికార్డ్ క్రియేట్ చేసిన చిరంజీవి సినిమా.. టాలీవుడ్లో ఫస్ట్ మూవీ ఇదే.!
Don't Miss!
- News
కోర్టుకెళ్తే..నిలువునా తగులబెడతాం: గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటికి కరపత్రం..!
- Finance
నవంబర్ నెలలో 3 ఏళ్ల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్భణం
- Technology
రెడ్మి కె30 4జీ vs రెడ్మి కె20, ఫీచర్లపై ఓ లుక్కేయండి
- Automobiles
2019 లో 10 టాప్ మోస్ట్ గూగిల్డ్ కార్స్
- Lifestyle
ఓ అందమైన వెన్నెల పున్నమి రాత్రి వేళ ఆమె గురించే ఆలోచిస్తున్న అతనికి ఓ అద్భుతం జరిగింది... అదేంటంటే..
- Sports
లాలిగా బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్: తొలి నాన్ పుట్బాలర్గా అరుదైన ఘనత
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
రష్మిక మందన్నా సెన్సేషన్: నా ఇంకో సగం మిస్ అయిందంటూ పోస్ట్.. విజయ్ గురించేనా.!
యంగ్ హీరో నాగశౌర్య నటించిన 'ఛలో' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ఆ తర్వాత ఆమె నటించిన 'గీత గోవిందం' కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే, తర్వాత పలు చిత్రాలు ఆశించినంతగా ఆడలేదు. అయినా జయాపజయాలతో సంబంధం లేకుండా రాణిస్తోంది ఈ రష్మిక.
అందంతో పాటు చక్కనైన అభినయం కలిగిన హీరోయిన్ కావడంతో ఈమె ఫుల్ బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంటోంది. అది కూడా స్టార్ హీరోల సినిమాల్లో కావడంతో అమ్మడు మంచి ఉత్సాహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం అది హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏంటా పోస్ట్..? ఎందుకు చర్చనీయాంశం అయింది.? వివరాల్లోకి వెళితే...

అక్కడ అమ్మడు ఫుల్ బిజీ
రష్మిక మందన్నా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా ఈ కన్నడ బ్యూటీ తన సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటు వ్యక్తిగత జీవితానికి చెందిన అంశాలను పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది.

అందరికీ ఆమె కావాలి
సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా రష్మికకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు'తో పాటు నితిన్ ‘భీష్మ' సినిమాలో నటిస్తోంది. వీటి తర్వాత సుకుమార్ - అల్లు అర్జున్ సినిమా షూటింగ్‌లో పాల్గొననుంది. వీటితో పాటు కన్నడ చిత్రాలకూ సంతకాలు చేసేసింది.
హాట్ టాపిక్‌గా రష్మిక పోస్ట్
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాజాగా ఓ ఫొటోను షేర్ చేసింది. ‘ఈ ఫొటోలో ఒకే ఒక్కటి మిస్ అయింది. అది నా మరో సగం అయిన మంకీ' అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆ మంకీ ఎవరన్న దానిపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. దీనిపై పలువురు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

రష్మిక అన్నది ఆ హీరో గురించేనా
రష్మిక పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. దీంతో ఆమె పేర్కొన్నది ఎవరి గురించి అని అందరూ ఆలోచిస్తున్నారు. తాజాగా దీనిపై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆమె చెప్పిన ఆ మంకీ విజయ్ దేవరకొండే అనేదే దాని సారాంశం. దీనికి కారణం.. వీళ్లిద్దరూ కలిసి గోవాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లడమేనని టాక్. రష్మిక ఫొటో కూడా అక్కడిదే కావడం విశేషం.

విజయ్‌తో లవ్ అంటూ ప్రచారం
గతంలో రష్మిక టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో ప్రేమాయణం సాగిస్తోందని కొందరు వార్తలు పుట్టించిన విషయం తెలిసిందే. దీనిపై కన్నడ బ్యూటీ స్వయంగా స్పందించింది. వీళ్లిద్దరూ కలిసి ‘గీత గోవిందం', ‘డియర్ కామ్రేడ్' చిత్రాల్లో నటించారు. దీంతో ఈ వార్తలు ఎక్కువైపోయాయి.