హీరోయిన్ సౌందర్యతో రష్మికకి పోలికా?

ఇప్పుడు ఇండియా వైడ్ గా మంచి ఫార్మ్ లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో సౌత్ నుంచి ఓ స్టార్ హీరోయిన్ రూల్ చేస్తుంది అని చాలా మంది ఊహించి ఉండకపోవచ్చు. మరి ఆ హీరోయిన్ నే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అని చెప్పాలి. కాగా రష్మిక మందన్నా సౌత్ నుంచి స్టార్ట్ అయ్యినప్పటికీ ఒకో మెట్టు ఎక్కుతూ ఇపుడు పాన్ ఇండియా లెవెల్లో మంచి డిమాండ్ ఉన్న బ్యూటీగా నిలిచింది.

కాగా రష్మిక మందన్నా దాదాపు ఇండియన్ సినిమా అన్ని ముఖ్య భాషల్లో కూడా నటిస్తుండగా తనపై నెగిటివిటీ కూడా లేకపోలేదు. అయినప్పటికీ వాటిని దాటుకొని పెర్ఫామర్ గా ఆమె ఎప్పటికపుడు తనని హేట్ చేసేవారికి సమాధానం ఇస్తూ వచ్చింది. ఇదిలా ఉండగా ఈమెపై మరో కాంట్రవర్సియల్ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మన సౌత్ సినిమా దగ్గర అలనాటి నటి సౌందర్య అంటే తెలియని వారు ఎవరూ ఉండరు.

rashmika mandanna projects her as soundarya here is clarity on this

ఒకప్పుడు ఎవరినైనా అమ్మాయిని అందంగా ఉన్నావు అని చెప్పడానికి హీరోయిన్ సౌందర్య తోనే పోల్చి చెప్పుకునేవారు. ఆ రేంజ్ లో అలనాటి నటి సౌందర్యకి ఒక ఔదార్యమైన స్థానం మన తెలుగు ఆడియెన్స్ లో ఉంది. కాగా అలాంటి బ్రాండ్ ఉన్న నటితో సమానంగా రష్మికాని పోలిస్తే ఎలా ఉంటుంది? మరి ఈ తరహా స్టేట్మెంట్ నే సోషల్ మీడియాలో ఒకటి వైరల్ గా మారింది.

రష్మిక చిన్నపుడు తన తండ్రి ఆమెని చూడటానికి సౌందర్యలా ఉన్నావు అని చెప్పేవారు అంటూ రష్మిక అన్నట్టుగా పలు వార్తలు నెటిజన్స్ నడుమ వైరల్ గా మారాయి. దీనితో ఇప్పటికే రశ్మికపై ఉన్న ట్రోల్స్ చాలవు అన్నట్టుగా ఇది కూడా వైరల్ అయ్యి తనపై కామెంట్స్ తీసుకొస్తుంది. కాగా ఇందులో అసలు నిజం ఏంటి అనేది తెలుస్తుంది. రష్మిక, సౌందర్య టాపిక్ నిజమే కానీ మొత్తం అర్ధం వేరేలా ఉంది.

అది కూడా ఎప్పుడో స్టేట్మెంట్ ని ఇపుడు మార్చి వక్రీకరించినట్టుగా తెలుస్తుంది. నిజానికి రష్మిక తండ్రికి సౌందర్య గారంటే అంటే ఎంతో అభిమానం అట. ఆ అభిమానంతో రష్మిక కూడా సినీ పరిశ్రమలోకి రాక ముందే సౌందర్య కోసం ఎంతో గొప్పగా చెప్పేవారట. అయితే ఈ స్టేట్మెంట్ ని కొందరు రష్మిక ఆమెని ఏకంగా సౌందర్యగా చెప్పేసుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

సో ఆ ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదని చెప్పవచ్చు. ఇక రీసెంట్ గానే నేషనల్ క్రష్ పాన్ ఇండియా ఇండస్ట్రీ హిట్ పుష్ప 2 తో పలకరించగా లేటెస్ట్ గా హిందీలో నటించిన అవైటెడ్ సినిమా "చ్చావా"తో ఈ ఫిబ్రవరిలో పలకరించేందుకు వస్తుంది. అలాగే ఈ సినిమా మాత్రమే కాకుండా హిందీలోనే స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ తో సికందర్ చేస్తుంది. అలాగే తెలుగులో ధనుష్ తో కుబేర తదితర సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా లైఫ్ ని రష్మిక లీడ్ చేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X