Rashmika Mandanna Pushpa first look: పుష్ప రాజ్ కోసం శ్రీవల్లిగా సరికొత్త అవతారం.. షాకింగ్ లుక్!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ ఎంచుకున్న పాత్రలు చాలా విభిన్నంగా ఉంటున్నాయి. ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్స్ ఎక్కువగా గ్లామరస్ పాత్రలతోనే ఆకట్టుకుంటున్నారు. అయితే సినిమా కథకు తగ్గట్టుగా మాత్రమే కొందరు గ్లామర్ ను పక్కన పెట్టేస్తున్నారు. రంగస్థలం సినిమాలో సమంత నటించిన విధానం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక దర్శకుడు సుకుమార్ మేకింగ్ తో ఆమెకు కెరీర్లో మర్చిపోలేని విజయం అందించాడు. ఇక అదే తరహాలో దర్శకుడు ఈ సారి రష్మిక మందన్నకు కూడా చూపించబోతున్నారని తెలుస్తోంది.

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా పుష్ప పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి ఇద్దరూ వారి స్థాయిని మరో లెవెల్ కు పెంచుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు ఫస్ట్ సాంగ్ కూడా సోషల్ మీడియాలో బాగానే హైప్ క్రియేట్ చేశాయి. అంతేకాకుండా అల్లుఅర్జున్ కు సంబంధించిన పోస్టర్స్ కూడా బాగానే వైరల్ అయ్యాయి. పుష్ప రాజ్ పాత్రలో మొదటి సారి అల్లు అర్జున్ తన లుక్ మొత్తం మార్చేశాడు. స్టైలిష్ స్టార్ అని కాకుండా ఐకాన్ స్టార్ గా మళ్లీ కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు సుకుమార్ కూడా క్లారిటీ ఇచ్చారు.

Rashmika Mandanna Pushpa movie first look sri valli

ఇక కొద్దిసేపటి క్రితమే దర్శకుడు సుకుమార్ రష్మిక మందన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో రష్మిక శ్రీవల్లి అనే గూడెం అమ్మాయి గా నటించబోతోంది. పుష్పరాజ్ సతీమణిగా శ్రీవల్లి పాత్ర ఈ సినిమాలో అద్భుతంగా ఉంటుందని ఇదివరకే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. ఇక ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా ఆమె పాత్ర స్వభావం కూడా కనిపిస్తోంది. పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే ఆహా భావాలు కనిపిస్తున్నాయి. పుష్ప రాజ్ కోసం అందంగా రెడీ అవుతున్నట్లు అలంకారాలు చేసుకుంటూ ఎదురుగా మల్లె పూలు కూడా పెట్టుకుంది. సోషల్ మీడియా లో విడుదలైన కొన్ని నిమిషాలకే ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్ గా మారింది.

ఇక సినిమాలో రష్మిక మందన పాత్ర కూడా అద్భుతంగా ఉంటుందని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అర్థమైనట్లు నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ స్టార్ హీరోయిన్ కెరీర్ లో ఇలాంటి పాత్రను పెద్దగా టచ్ చేసింది లేదు. సుకుమార్ రంగస్థలం తర్వాత మళ్లీ అదే తరహాలో ఒక మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకోవాలని అనుకుంటోంది. మరి ఆ సినిమా రష్మికకు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. ఇక పుష్ప సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఫస్ట్ పార్ట్ ను డిసెంబర్ లో క్రిస్మస్ కు విడుదల చేయనున్నారు. ఇక రెండవ భాగంను వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X