మేమూ మీలాగే జీతగాళ్లం.. అదేమీ అత్యాశ కాదు.. రష్మిక మందన్న షాకింగ్ రియాక్షన్

కన్నడ భామ రష్మిక మందన్న అనతికాలం లోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది. 'ఛలో' అంటూ టాలీవుడ్ గడపతొక్కిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస అవకాశాలు పట్టేస్తూ సూపర్ ఫామ్‌లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' రూపంలో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకుంది. అయితే తాజగా.. తన రెమ్మ్యూనరేషన్ విషయమై కొద్దిరోజులుగా వినిపిస్తున్న వార్తల పట్ల స్పందించింది రష్మిక. వివరాల్లోకి పోతే..

రష్మిక డేట్స్ కోసం దర్శకనిర్మాతల క్యూ

రష్మిక డేట్స్ కోసం దర్శకనిర్మాతల క్యూ

ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్ ఎవరంటే.. ఠకీమని రష్మిక మందన్న పేరే చెబుతున్నారంతా. ఆమెకు వచ్చిన ప్రతీ అవకాశమూ ఒక్కో మెట్టు ఎక్కించి తన నటనా నైపుణ్యాన్ని ప్రేక్షకుల ముందుంచింది. ఈ కారణంగా రష్మిక డేట్స్ కోసం వెంటపడుతున్నారు దర్శకనిర్మాతలు.

రష్మిక కోలీవుడ్ ఎంట్రీ.. ఇదీ ప్లాన్

రష్మిక కోలీవుడ్ ఎంట్రీ.. ఇదీ ప్లాన్

మాతృభాష కన్నడంలో పాటు తెలుగులో కూడా సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతోంది. కార్తీకి జంటగా సుల్తాన్‌ చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

 చుక్కలు చూపిస్తున్న రష్మిక.. భారీగా డిమాండ్

చుక్కలు చూపిస్తున్న రష్మిక.. భారీగా డిమాండ్

ఈ నేపథ్యంలో రష్మిక మందన్న తన రెమ్మ్యూనరేషన్ భారీగా పెంచేసిందనే టాక్ బయటకొచ్చింది. తన వద్దకు వచ్చిన దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందని, తాను హీరోయిన్ గా చేయాలంటే కనీసం 3 నుంచి 4 కోట్ల మేర సమర్పించుకోవాల్సిందే అని డిమాండ్ చేస్తోందని వార్తలు వచ్చాయి. తాజాగా ఇలాంటి వార్తలపై స్పందించింది రష్మిక.

స్టార్‌ హీరోలతో అదృష్టమే కానీ..

స్టార్‌ హీరోలతో అదృష్టమే కానీ..


తాజాగా రష్మిక ఒక భేటీలో పాల్గొని ఈ విషయాలను ప్రస్తావించింది. సినిమా రంగంలోకి ప్రవేశించిన కొద్ది రోజుల్లోనే స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలు రావడం తన అదృష్టమే అని పేర్కొంది. కాకపోతే ఇండస్ట్రీ నిలదొక్కుకోవాలంటే కఠినంగా శ్రమించాల్సి ఉంటుందని చెప్పింది.

అది కూడా ఓ ఉద్యోగమే.. ఇంత చిన్న వయసులో

అది కూడా ఓ ఉద్యోగమే.. ఇంత చిన్న వయసులో

నటీనటుల ప్రతిభను చూసే దర్శక నిర్మాతలు అవకాశాలు ఇస్తారని రష్మిక తెలిపింది. ఇంత చిన్న వయసులోనే నటిగా స్టార్‌ హోదా లభించడం తనకే ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. అయితే తాను ఎక్కువ పారితోషికాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు టాక్ వచ్చిందని.. నటన కూడా ఓ ఉద్యోగమేనని అని తెలుపుతూ ఆసక్తికర రియాక్షన్ ఇచ్చింది.

తమది ఆ ఉద్యోగం కాదంటూ

తమది ఆ ఉద్యోగం కాదంటూ

ఉద్యోగం చేసే వారు ఒకసారి జీతం తీసుకుంటే ఆ తరువాత జీతం పెరగాలని ఎదురు చూస్తారు కదా!. తామూ అంతేనని చెప్పింది రష్మిక. అయితే తాము నెల నెలా జీతం తీసుకునే ఉద్యోగం చేయడం లేదని.. చిత్ర విజయాలను బట్టే తమ భవిష్యత్తు ఉంటుందని ఆమె పేర్కొంది.

అదేమీ అత్యాశ కాదుగా!

అదేమీ అత్యాశ కాదుగా!

అర్హతకు తగ్గ పారితోషికాన్ని డిమాండ్‌ చేయడం అత్యాశ కాదని రష్మిక పేర్కొనడం గమనార్హం. ఇకపోతే మరికొద్ది రోజుల్లో ఈ భామ హీరోయిన్‌గా నటించిన 'భీష్మ' ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త ప్రాజెక్టులోనూ రష్మిక నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X