మా మధ్య అలాంటిదేమీ లేదు.. ఎక్కువగా ఊహించుకోవద్దు.. విజయ్ దేవరకొండతో లిప్‌లాక్‌పై రష్మిక

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన డియర్ కామ్రేడ్ చిత్ర టీజర్ మరోసారి క్రేజీగా మారింది. ఈ టీజర్‌లో విజయ్, రష్మిక లిప్‌లాక్ వివాదంగా మారింది. రష్మిక మరోసారి లిప్‌లాక్ చేయడంపై నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మిని తలపిస్తున్నారని మండిపడుతున్నారు. ఇలా తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై రష్మిక ఇటీవల ప్రముఖ దినపత్రికతో తన అభిప్రాయాన్ని పంచుకొన్నారు. ఆమె ఏమన్నారంటే..

విజయ్, రష్మిక లిప్‌లాక్‌పై ట్రోలింగ్

విజయ్, రష్మిక లిప్‌లాక్‌పై ట్రోలింగ్

గీత గోవిందం సినిమాలో కూడా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లిప్‌లాక్ చేయడంపై అప్పట్లో విమర్శలు చెలరేగాయి. ఆ సమయంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో రష్మిక ఎంగేజ్‌మెంట్ జరిగి ఉండటం, అలాంటి సందర్భంలో లిప్ లాక్ చేయడం సమంజసమా? అనే ప్రశ్నలను నెటిజన్లు లేవనెత్తారు. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల్లో రష్మిక ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ కావడం తెలిసిందే.

డియర్ కామ్రేడ్‌లో అదిరిన కెమిస్ట్రీ

డియర్ కామ్రేడ్‌లో అదిరిన కెమిస్ట్రీ

గీత గోవిందం ఊహించిన విజయాన్ని అందుకోవడం, వంద కోట్ల వసూళ్లు రాబట్టడంతో విజయ్ దేవరకొండ, రష్మిక జంటకు మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో మళ్లీ డియర్ కామ్రేడ్‌లో జతకట్టారు. దాంతో వారి మధ్య అఫైర్ ఉందంటూ వార్తలు ఊపందుకొన్నాయి. అంతేకాకుండా బ్రేకప్‌కు కారణం విజయ్ దేవరకొండ అనే మాట మీడియాలో బలంగా వినిపించింది. తాజాగా విజయ్‌తో రిలేషన్‌ గురించి లిప్‌లాక్ మరింత చర్చకు దారి తీసింది.

రష్మిక మందన్న ఏమన్నారంటే

రష్మిక మందన్న ఏమన్నారంటే

డియర్ కామ్రేడ్ లిప్‌లాక్ వ్యవహారం సోషల్ మీడియాలో మరింత విజృంభిస్తున్న సమయంలో రష్మిక మందన్న స్పందించారు. సినిమాలో లిప్ లాక్ సీన్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. స్టోరి డిమాండ్ మేరకే అది ఉంటుంది. నా పాత్రకు న్యాయం చేయడానికే ఆ సీన్ చేయాల్సి వచ్చింది. కేవలం లిప్‌లాప్‌తో సినిమాను జడ్జ్ చేయడం సరికాదు అని రష్మిక తన అభిప్రాయాన్ని వెల్లడించినట్టు వార్త కథనం వెలువడింది.

గీత గోవిందం సమయంలో కూడా

గీత గోవిందం సమయంలో కూడా

ఏదో లిప్‌లాక్‌ను ఊహించుకొని అప్పుడే పూర్తిగా నిర్ణయానికి రావొద్దు. సినిమా చేస్తే మీకే అర్ధమవుతుంది. అలాంటి సీన్ ఎలాంటి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందనే విషయం ప్రతీ ఒక్కరికి తెలుస్తుంది. గీత గోవిందం సినిమా సమయంలో కూడా ఇలానే వివాదం సృష్టించారు. ఆ తర్వాత అన్ని వర్గాల ప్రేక్షకులు దానిని ఆదరించారనే విషయాన్ని రష్మిక గుర్తు చేశారు.

క్రికెటర్‌గా రష్మిక.. కమ్యూనిస్ట్‌గా విజయ్ దేవరకొండ

క్రికెటర్‌గా రష్మిక.. కమ్యూనిస్ట్‌గా విజయ్ దేవరకొండ

డియర్ కామ్రేడ్ చిత్రంలో రష్మిక మందన్న క్రికెటర్‌గా నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ కమ్యునిస్ట్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిగా.. స్టూడెంట్ లీడర్‌గా ఆసక్తికరమైన పాత్రను పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకుడు. ఈ సినిమా మే 22న రిలీజ్ కానున్నది. ఇటీవల రిలీజైన టీజర్ 10 మిలియన్ల వ్యూస్ రావడం సినిమాపై నెలకొన్న క్రేజ్‌ను వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X