Rashmika Mandanna: ఐదు ఏళ్లలో 5 లగ్జరీ ఇళ్లు కొన్న రష్మిక మందన్నా.. ఎక్కడెక్కడ.. ఎలా అంటే?
కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ కావడం, కాంతార హీరో అండ్ డైరెక్టర్ పై వ్యాఖ్యలతో తెగ ట్రోలింగ్ ఎదుర్కొంది ఈ నేషనల్ క్రష్. అలాగే ఏదో ఒక అంశంపై రష్మికను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఆ ట్రోలింగ్ పై కూడా చాలా సార్లు రియాక్ట్ అయింది రష్మిక మందన్నా.
తాను ఏం చేసినా సమస్య అయితే చెప్పడానికి ఏముంది అని కూడా వివరణ ఇచ్చింది. అలాగే అబ్యూసింగ్ పదాలతో తాను సినిమాల్లో నటించకూడదని కూడా ఫిక్స్ అయినట్లు చెప్పుకొచ్చింది ఈ భామ. అయితే తాజాగా రష్మిక మందన్నాకు సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

పుష్పతో క్రేజీ ఆఫర్లు..
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. కుర్రాళ్లకు నేషనల్ క్రష్ గా ఎదిగిన ఈ భామ ఇప్పుడు సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవల కాలంలో ఎక్కువగా నార్త్ సినిమాలు చేస్తూ అక్కడ కూడా తన సత్తా చాటుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పుష్పతో వచ్చిన క్రేజ్ తో విపరీతమైన ఆఫర్లు అందుకుంటూ ముందుకు సాగుతోంది.

మొదటి సినిమాతోనే ఫేమ్..
కన్నడలో కిరిక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది బ్యూటిఫుల్ రష్మిక మందన్నా. ఈ సినిమాలో రక్షిత్ శెట్టి హీరోగా చేయగా.. కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. రష్మిక చేసిన మొదటి సినిమా కిరిక్ పార్టీ సూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే అదే భాషల్లో అనేక ఆఫర్లు వెల్లువెత్తాయి. దీంతో కన్నడలో అనేక సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే తెలుగులో 'ఛలో' చిత్రంతో రంగప్రవేశం చేసింది.

ఆకట్టుకోని హిందీ చిత్రం..
ఛలో సినిమాలో ఆకట్టుకున్న రష్మిక మందన్నా ఆ తర్వాత వరుసగా 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి భారీ హిట్లను సొంతం చేసుకోవడంతో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఇక పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ప్రస్తుతం సౌత్, నార్త్ అంటూ తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. ఇటీవలే ఆమె నటించిన హిందీ చిత్రం గుడ్ బై అంతగా ఆకట్టుకోలేదు. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కలిసి నటించిన వారసుడు సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది.

రెండు చిత్రాలతో బిజీగా..
బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రతో రష్మిక మందన్నా జోడీ కట్టిన మిషన్ మజ్ను మూవీ కాస్తా పర్వాలేదనిపించుకుంది. ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాతో రష్మిక మందన్నా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం 'పుష్ప: ది రూల్' (పుష్ప 2)తోపాటు యానిమల్ చిత్రాలు చేస్తోంది రష్మిక మందన్నా. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు.

ఐదు నగరాల్లో ఐదు అపార్ట్ మెంట్స్..
అయితే తాజాగా రష్మిక మందన్నాకు ఐదు నగరాల్లో ఐదు లగ్జరీ ఇళ్లు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. నెర్డీ న్యూస్ అనే ట్విటర్ పేజీ రష్మిక మందన్నా తన పెట్ డాగ్ తో ఆడుకుంటున్న ఫొటో షేర్ చేస్తూ.. తను ఇప్పటివరకు సంపాదించిన అతి విలాసవంతమైన అపార్ట్ మెంట్స్ వివరాలను రాసుకొచ్చింది. "ఐదేళ్ల సినీ కెరీర్ లో రష్మిక మందన్నా హైదరాబాద్, గోవా, కూర్గ్, ముంబై, బెంగళూరు నగరాల్లో లగ్జరీ అపార్ట్ మెంట్స్ కొనేసింది. 2021లో బ్యాక్ టు బ్యాక్ ప్రాపర్టీస్ ఇన్వెస్ట్ చేసింది" అని పోస్టుపై తెలిపింది.
కొనుక్కుంటే తప్పేముంది..
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా అనేక వెబ్ సైట్స్ రాసుకొచ్చాయి. దీంతో ఈ పోస్ట్ రష్మిక మందన్నా కంటపడింది. ఆ పోస్ట్ కు "ఇదంతా నిజం కావాలని కోరుకుంటున్నా" అని సమాధానం ఇచ్చింది గ్లామరస్ భామ రష్మిక మందన్నా. రష్మిక రిప్లై చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే "ఎన్ని అపార్ట్ మెంట్స్ కొన్నావో చెప్పు" అని కొందరు అడిగితే.. మరికొందరు "ఒకవేళ ఆమె ఆస్తులు కొనుక్కుంటే దానిపై ఆర్టికల్ రాయాల్సిన అవసరం ఏముంది. తన సొంత డబ్బుతోనే కదా కొనుక్కుంది" అని అంటున్నారు. ఇలా పలు కామెంట్స్ తో రష్మిక మళ్లీ ట్రోలింగ్ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











