వాళ్లు తానా అంటే నేను తందాన అనాలా? కన్నడ బ్యాన్‌పై రష్మిక మందన్న ఘాటైన వ్యాఖ్యలు
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత పదేళ్లుగా సినీ రంగంలో ఉన్న ఈ కన్నడ బ్యూటీ, ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం ఉత్తరాది సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారిన రష్మిక, ఇటీవలే తన ప్రేమించిన రౌడీ హీరో విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం చేసుకున్నారట. ఇలా గత కొన్ని రోజులుగా నటి రష్మికా మందన్నా పేరు సోషల్ మీడియా, వెబ్ వార్తలలో ట్రెండింగ్‌లో ఉంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మికా, తాజాగా తన అప్‌కమింగ్ మూవీ 'థామా' విడుదలకు సంబంధించిన ఇంటర్వ్యూలో, కన్నడ ఇండస్ట్రీ తనను బ్యాన్ చేసిందంటూ వస్తున్న రూమర్స్‌పై స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో 'ఛలో' సినిమాలో అడుగుపెట్టి రష్మిక ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగింది, పుష్ప, పుష్ప 2, యానిమిల్, ఛావా వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం రష్మికా వద్ద అరడజను ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అలాగే ఆమె భాషల పరిమితి లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో తన నటన ద్వారా గుర్తింపు పొందింది. కన్నడలో పుట్టి పెరిగిన రష్మికా 'కిరిక్ పార్టీ' తో కెరీర్ ప్రారంభించి, తెలుగు, హిందీ, కన్నడ వంటి పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే ఇటీవల, కన్నడలో భారీ విజయాన్ని సాధించిన 'కాంతారా: చాప్టర్ 1' సినిమాకు సంబంధించి రష్మికా సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్‌కు గురయ్యారు. కొందరు నెటిజన్లు ఆమెను కన్నడ పరిశ్రమను మర్చిపోయిందని, పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లపై ఫోకస్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నారు.

తాజాగా రష్మిక మందాన్న తన అప్‌కమింగ్ మూవీ 'థామా'ప్రమోషన్ మాట్లాడుతూ.. తెర వెనుక ఏం జరుగుతుందో చాలామందికి తెలియదని, వ్యక్తిగత జీవితాన్ని ప్రజల ముందు తీసుకురావడం సాధ్యం కాదు అని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన 'కాంతార: చాప్టర్ 1' సినిమాకు స్పందించకపోవడం వల్ల వచ్చిన విమర్శలపై కూడా ఆమె స్పందించారు. "ఏ సినిమా అయినా విడుదలైన వెంటనే చూసి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం సాధ్యం కాదు. కాంతారాను కూడా విడుదల తర్వాత రెండు-మూడు రోజుల తర్వాత చూశాను. చిత్ర బృందానికి అభినందనలు తెలిపాను. వారు నాకు 'ధన్యవాదాలు' కూడా తెలిపారు," అని ఆమె చెప్పారు.
రష్మికా మరింత చెప్పగా, "తెర వెనుక ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదని, మన వ్యక్తిగత జీవితాన్ని కెమెరా ముందు చూపలేమని గమనించండి. నేను ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకునే వ్యక్తిని కాదు. ప్రజలు నా నటన, వృత్తిపరమైన పనితీరు గురించి ఏం అనుకుంటారో, అది మాత్రమే నాకు ముఖ్యం. అందుకే ప్రజలు ఏమనుకున్నా పట్టించుకోవడం లేదు. వ్యక్తిగత విషయాలపై అబద్దపు ప్రచారం చేయకండి," అని విజ్ఞప్తి చేశారు.
కన్నడ ఇండస్ట్రీ తనను బ్యాన్ చేసిందా అనే రూమర్స్‌పై రష్మికా స్పందించారు: "ఇప్పటివరకూ ఎవరూ నన్ను ఏ ఇండస్ట్రీలోనూ నిషేధించలేదు. ఇతరుల అభిప్రాయాల కోసం జీవించొద్దు. ఇలాంటి రూమర్స్ సాధారణంగా అపార్థాలు, అపూర్ణమైన సమాచారం వల్ల పుట్టుకొస్తాయి," అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. రష్మికా ఫ్యాన్స్, సినీ అభిమానుల మధ్య చర్చకు దారితీస్తున్నాయి. విశ్లేషకులు అభిప్రాయపడుతున్నట్లు, స్టార్ హీరోల జీవితంలో వ్యక్తిగత ప్రైవసీ ప్రాధాన్యతను గుర్తించడం, వ్యూయర్లకు సరైన సమాచారం ఇవ్వడం సమకాలీన డిజిటల్ యుగంలో ఎంత ముఖ్యమో రష్మికా ఉదాహరణ చూపుతోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రష్మికా 'తమ్మా', 'ది గర్ల్‌ఫ్రెండ్' వంటి ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను కనెక్ట్ అవ్వడానికి సిద్దమవుతున్నారు. ఈ సందర్భంలో ఆమె సోషల్ మీడియా వైరల్ గా మారుతున్నాయి.


Click it and Unblock the Notifications











