For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో రిలేషన్ షిప్‌పై రష్మిక మందన్న క్యూట్‌గా.. లైగర్‌పై షాకింగ్ కామెంట్స్

  |

  చూపు తిప్పుకోకుండా చేసే అందం, అద్భుతమైన నటనతో తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిన కన్నడ భామ రష్మిక మందన్నా. మొదట కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి విజయాలను అందుకున్న రష్మిక మందన్న ఆ తర్వాత చాలా తొందరగానే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. ఇక ఈ బ్యూటీ మొదట చిన్న సినిమాలతోనే మంచి విజయాలను అందుకొని ఆ తర్వాత అగ్ర హీరోలతో అవకాశాలను అందుకుంది. ఫలింతంగా నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. ఇక స్టైలిష్ స్టార్ అర్జున్ తో నటించిన పుష్ప మూవీతో బీభత్సమైన క్రేజ్ వచ్చింది. దీంతో వరుసగా ఇటు కోలీవుడ్ అటు బాలీవుడ్ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అందులో ఒకటి గుడ్ బై చిత్రం. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స లో ఆసక్తికర సమాధానాలు చెప్పింది ఈ బ్యూటి.

   కిరిక్ పార్టీ అనే కన్నడ చిత్రంతో

  కిరిక్ పార్టీ అనే కన్నడ చిత్రంతో

  నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 'కిరిక్ పార్టీ' అనే కన్నడ చిత్రం ద్వారా రష్మిక మందన్నా ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే అదే భాషల్లో ఎన్నో సినిమాలు చేసింది. ఆ సమయంలోనే హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం సాగించి నిశ్చితార్థం కూడా చేసుకుంది.

  ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్..

  ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్..

  ఇక, 'ఛలో' మూవీతో తెలుగులోకి వచ్చిన తర్వాత ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకుని షాకివ్వడంతో పాటు పాపులర్ అయింది. ఛలో' నుంచి మొదలుకొని 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి భారీ హిట్లను సొంతం చేసుకోవడంతో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. మధ్యలో కొన్ని పరాజయాలు వచ్చినా రష్మిక‌కు స్టార్‌డమ్‌తో పాటు క్రేజ్ కూడా భారీ స్థాయిలో పెరిగింది.

  శ్రీవల్లిగా నటించి..

  శ్రీవల్లిగా నటించి..

  నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అందులో శ్రీవల్లిగా నటించి యూత్ ను ఫిదా చేసిందనే చెప్పవచ్చు. దీంతో ఆమెకు ఇటు బాలీవుడ్, అటు కోలీవుడ్ లో వరుసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఆమె నటించిన చిత్రం గుడ్ బై. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కుమార్తెగా నటించింది రష్మిక మందన్నా.

  డిఫరెంట్ క్యారెక్టర్ చేసినట్లు..

  డిఫరెంట్ క్యారెక్టర్ చేసినట్లు..

  గుడ్ బై మూవీ ట్రైలర్ చూస్తుంటే ఇందులో రష్మిక మందన్నా డిఫరెంట్ క్యారెక్టర్ చేసినట్లు తెలుస్తోంది. హిందీలో తొలిసారిగా నటించిన ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీ గ్లామర్ లుక్ లో కనిపించింది. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ ను బాగానే చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఈవెంట్లలో పాల్గొంటుంది రష్మిక మందన్నా.

   బాలీవుడ్ మీడియాతో ఆసక్తికర సమాధానాలు..

  బాలీవుడ్ మీడియాతో ఆసక్తికర సమాధానాలు..

  ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న రష్మిక మందన్నా బాలీవుడ్ మీడియాతో ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో తనకున్న రిలేషన్ షిప్ గురించి అడగ్గా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ బ్యూటి. ''విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం, డియర్ కామ్రెడ్ చిత్రాలు చేశాను. ఆ మూవీస్ తో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఇప్పుడూ అందరూ రష్మిక-విజయ్ దేవర కొండ అంటూ మా రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతున్నారు.

   నాకు చాలా ఆనందంగా ఉంది..

  నాకు చాలా ఆనందంగా ఉంది..

  అలా మాట్లుడుకోవడం చూస్తుంటే నాకు చాలా క్యూట్ గా, ఆనందంగా ఉంది'' అని రష్మిక తెలిపింది. అలాగే విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ''లైగర్ మూవీ నచ్చిందా?'' అనే ప్రశ్నపై ''లైగర్ మూవీని ఇటీవల చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. మాస్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. సినిమా చూస్తున్నంత సేపు విజిల్స్ వేయడం, డ్యాన్స్ కూడా చేశాను. లైగర్ సినిమా ఫలితం ఎలా ఉన్నా నాకు అయితే ఎంతో నచ్చింది. తన నటనతో విజయ్ అదరగొట్టేశాడు. ఫిట్ నెస్ పై ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. వెల్ డన్ విజయ్'' అని ఈ కన్నడ అందం చెప్పుకొచ్చింది.

  English summary
  National Crush Rashmika Mandanna Reacts To Relationship With Vijay Devarakonda And Liger Movie In Goodbye Movie Promotions.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X