కుక్క పిల్లకు ఫ్లైట్ టికెట్ల వార్త పై పెదవి విప్పిన రష్మిక.. రావడం ఇష్టముండదట!
చేసింది కొన్ని సినిమాలే అయినా అవన్నీ హిట్ కావడంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కన్నడ కస్తూరి రష్మిక మందన్న. కన్నడ సినిమాల ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత
తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిన ఆమె ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. తాజాగా ఆమె గురించి ఒక ఆసక్తికర ప్రచారం జరుగుతూ ఉండగా దానిమీద ఆమె ఏ మాత్రం వెనకడుగు వేయకుండా స్పందించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే...

హీరోయిన్ గా మారి
కన్నడలో కిరాక్ పార్టీ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా మారింది రష్మిక మందన్న. ఆ తర్వాత చలో అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే హిట్ అందుకుని హీరోయిన్ గా స్థిరపడిపోయింది. ఆ తర్వాత ఆమె చేస్తున్న అన్ని సినిమాలు కూడా హిట్ అవుతతూ ఉండడంతో ఆమెకు వరుస సినిమా అవకాశాలు రావడమే కాక బాలీవుడ్లో సైతం అవకాశాలు దక్కించుకునే స్థాయికి వెళ్లింది

ఫ్లైట్ టికెట్ లు
ప్రస్తుతం ఆమె చేతి నిండా సినిమాలతో ఒకపక్క ముంబై, మరోపక్క హైదరాబాద్, మరోపక్క చెన్నై అంటూ వరుసగా షూటింగ్ ల కోసం ప్రయాణాలు చేస్తోంది. అయితే ఆమె షూటింగ్ కి వెళ్లే సమయంలో ఆమె పెంపుడు కుక్క ఉండడం లేదని, ఆమె లేకుండా బెంగ పెట్టుకుంటూ ఉండడంతో తనతో పాటు తన కుక్కపిల్లకు కూడా ఫ్లైట్ టికెట్ లు వేయించాలని నిర్మాతలను రష్మిక కోరినట్టుగా ప్రచారం జరిగింది.

నాతో రావడం ఇష్టం లేదు
అయితే తాజాగా ఈ విషయం మీద రష్మిక మందన్న సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చేసింది. తన గురించి కథనాలను ప్రచురించిన వెబ్సైట్ ట్వీట్ రీ ట్వీట్ చేస్తూ ఇది వినడానికే నవ్వొస్తోంది, ఒకవేళ మీరు నిజంగా కుక్కపిల్లను నాతో పాటు తీసుకువెళ్ళాలి అని అనుకున్నా సరే దానికి నాతో రావడం ఇష్టం లేదు. అది హైదరాబాద్ లోనే ఉండాలి అనుకుంటుంది అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

విజయ్ హీరోగా
అంతేకాక ఇది చూస్తుంటే తనకు నవ్వు ఆగడం లేదు అంటూ మరోసారి ట్వీట్ చేశారు. దీంతో ఈ వార్తలన్నీ నిజం కాదని రష్మిక మందన్న క్లారిటీ ఇచ్చినట్లు అయింది. మరోపక్క రష్మిక చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఒకపక్క తెలుగు మరోపక్క తమిళ అలాగే హిందీ సినిమాలు చేస్తూ ఆమె హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పటికే విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారసుడు అనే ద్విభాషా చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది.

కుక్కపిల్లను కొనుగోలు చేసి
అలాగే ఆమె హిందీలో నటించిన కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా తాజాగా మరో సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఈ విషయాన్ని రష్మిక తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇక రష్మిక కుక్కపిల్ల విషయానికి వస్తే ఆమె కొద్ది రోజుల క్రితం కాకర్ స్పానియల్ అనే ఒక జాతికి చెందిన కుక్కపిల్లను కొనుగోలు చేసింది. తర్వాత దానితో కలిసి ఉన్న ఫోటోలు అనేక సోషల్ మీడియా షేర్ చేయడంతో ఆ ఫోటోలన్నీ వైరల్ గా మారాయి


Click it and Unblock the Notifications











