Rashmika Mandanna: కన్నడలో బ్యాన్ పై రష్మిక రియాక్షన్.. కెమెరా ముందు ఎలా అంటూ కామెంట్స్!

అద్భుతమైన నటన తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిన కన్నడ భామ రష్మిక మందన్నా. మొదట కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి విజయాలను అందుకున్న రష్మిక మందన్న ఆ తర్వాత చాలా తొందరగానే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. చిన్న సినిమాలతోనే మంచి విజయాలను అందుకున్న రష్మిక అనంతరం అగ్ర హీరోల సరసన నటించింది. ఫలింతంగా యువతకు నేషనల్ క్రష్ గా మారింది. అయితే ఇటీవల కాంతార సినిమాపై రష్మిక మందన్నా చేసిన కామెంట్లపై నెటిజన్లు విపరీతంగా విరుచుకుపడ్డారు. ఏకంగా ఆమెను కన్నడలో బ్యాన్ చేశారని కూడా వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై తాజాగా రష్మిక మందన్నా స్పందించింది.

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన..

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన..

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ రష్మిక మందన్నా సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'కిరిక్ పార్టీ' అనే కన్నడ చిత్రం ద్వారా రష్మిక మందన్నా ఎంట్రీ ఇచ్చింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే అదే భాషల్లో అనేక సినిమాలు చేసింది. ఆ సమయంలోనే హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం సాగించి నిశ్చితార్థం కూడా చేసుకుంది.

రక్షిత్ శెట్టికి షాక్..

రక్షిత్ శెట్టికి షాక్..

తెలుగులో 'ఛలో' మూవీతో తెరంగేట్రం చేసిన తర్వాత రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకుని షాక్ ఇచ్చింది రష్మిక మందన్నా. తెలుగులో ఛలో' నుంచి మొదలుకొని 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి భారీ హిట్లను సొంతం చేసుకోవడంతో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. మధ్యలో కొన్ని పరాజయాలు వచ్చినా రష్మిక‌కు స్టార్‌డమ్‌తో పాటు క్రేజ్ కూడా భారీ స్థాయిలో పెరిగింది.

అంతగా ఆకట్టుకోని హిందీ చిత్రం..

అంతగా ఆకట్టుకోని హిందీ చిత్రం..

ఇక ఇటీవల నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అందులో శ్రీవల్లిగా నటించి యూత్ ను ఫిదా చేసిందనే చెప్పవచ్చు. దీంతో ఆమెకు ఇటు బాలీవుడ్, అటు కోలీవుడ్ లో వరుసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే ఆమె నటించిన హిందీ చిత్రం గుడ్ బై అంతగా ఆకట్టుకోలేదు. అయినా బాలీవుడ్ లో పలు సినిమాలకు సంతకం చేసింది. అలాగే కోలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

సొంత ఇండస్ట్రీకి చెంది..

సొంత ఇండస్ట్రీకి చెంది..

అయితే ఇటీవల రష్మిక మందన్నా చేసిన కామెంట్స్ ఆమెకు తలనొప్పి తీసుకొచ్చింది. ఇటీవల కన్నడ నాట విడుదలై యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించిన సినిమా కాంతార. రష్మిక మందన్నాను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన రిషబ్ శెట్టి హీరోగాపాటు దర్శకత్వ వహించిన ఈ సినిమా ఇది. ఈ చిత్రంపై రష్మిక మందన్నాను అడగ్గా.. కాంతార సినిమాను చూడలేదని సమాధానమిచ్చింది. దీంతో మిమ్మల్ని సినీ రంగానికి పరిచయం చేసిన డైరెక్టర్ సినిమా చూడకపోవడం ఏంటీ, ప్రభాస్, రజనీకాంత్ వంటి స్టార్స్ ప్రశంసిస్తున్న చిత్రాన్ని సొంత ఇండస్ట్రీకి చెందిన రష్మిక చూడకపోవడం ఏంటీ నెటిజన్లు విపరీతంగా ఏకి పారేశారు.

రిషబ్ శెట్టి కౌంటర్..

రిషబ్ శెట్టి కౌంటర్..

అలాగే ఓ ఇంటర్వ్యూలో కిర్రిక్ పార్టీ సినిమా గురించి ఆ మూవీ దర్శకనిర్మాతల పేరు చెప్పకుండా ఒక సైగతో రష్మిక మందన్నా వివరించడం కన్నడ ప్రజలకు కోపం తెప్పించింది. దీనిపై రిషబ్ శెట్టి కౌంటర్ ఇచ్చినా.. ఆమెపై ఆగ్రహం తగ్గలేదు. ఈ క్రమంలోనే ఆమెను కన్నడలో బ్యాన్ చేశారని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై తాజాగా రష్మిక మందన్నా స్పందించింది. తనపై కన్నడలో ఎలాంటి నిషేధం విధించలేదని తెలిపింది.

కెమెరా ముందు ఎలా బయటపెడతాం..

కెమెరా ముందు ఎలా బయటపెడతాం..

నిజానికి కాంతార సినిమా విషయంలో కొంతమంది అత్యుత్సాహం చూపించారని, ఆ మూవీ విడుదలైన రెండు మూడు రోజుల్లో అడిగారు. అప్పుడు తాను చూడలేకపోయానని రష్మిక మందన్నా పేర్కొంది. అయితే తర్వాత సినిమా చూసిన తాను మూవీ యూనిట్ కి మెసేజ్ పెట్టానని వివరించింది. కానీ ఇవన్నీ ప్రేక్షకులకు తెలియవని చెప్పింది. వృత్తిపరంగా ఏం ఉన్నా అవన్నీ ప్రేక్షకులకు తెలియజేస్తానని, అది తన బాధ్యతగా పేర్కొంది. అయితే పర్సనల్ విషయాలను మాత్రం కెమెరా ముందు ఎలా బయటపెడతామని, అంత అవసరం కూడా లేదని చెప్పుకొచ్చింది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X