‘కాలేజ్ రోజుల్లోనే అలా పిలిచేవారు..’: నేషనల్‌ క్రష్‌ ట్యాగ్‌పై రష్మిక షాకింగ్ కామెంట్స్

Rashmika: రష్మిక మందాన.. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ కన్నడ బ్యూటీ టాలీవుడ్ లో వరుస విషయాలను అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక అల్లు అర్జున్- సుకుమార్ క్రేజీ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప' సినిమాతో 'నేషనల్ క్రష్' గా మారింది. ఈ సినిమాతో రష్మిక వర్డల్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తన అందం, అభినయంతో కోట్లాది మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది రష్మిక. ఇటీవల బాలీవుడ్ లో అడుగుపెట్టి ఈ బ్యూటీ దుమ్మురేపుతోంది. నేషనల్‌ క్రష్‌ ట్యాగ్‌ గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నేషనల్ క్రష్ రష్మిక 'ఛావా' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా నటించింది. లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహించగా.. ఈ సినిమాను దివ్యంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో శంభాజీ మహరాజ్‌గా విక్కీ కౌశల్‌, ఆయన సతీమణి యేసుబాయి పాత్రలో రష్మిక నటించారు.ఈ సినిమాలో అక్షయ్‌ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా వర్డల్ వైడ్ గా ఫిబ్రవరి 14న ఇది విడుదల కానుంది.

Rashmika Mandanna reacts to the National Crush tag and calls her fans cute

ఇవే కాకుండా రష్మిక చేతులో 'సికిందర్'అనే బాలీవుడ్ మూవీ కూడా ఉంది. ఈ సినిమాకు ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ కండాల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో పూర్తికాబోతుంది. షెడ్యూల్ ప్రకారం ఈసినిమా మార్చిలో విడుదల కానుంది. ఇలా భారీ బడ్జెట్, మల్టీ స్టారర్ మూవీలో రష్మికకు బాలీవుడ్ లో మరో భారీ అవకాశం లభించింది. అంతే కాకుండా.. 'కుబేర', 'సికందర్‌', 'థామా', 'ది గర్ల్‌ఫ్రెండ్‌', 'రెయిన్‌ బో' సినిమాల్లో రష్మిక యాక్ట్‌ చేస్తున్నారు.

రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేషనల్‌ క్రష్‌ ట్యాగ్‌ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వయసుతో సంబంధం లేకుండా తాను ఇప్పుడు అందరి ప్రేమాభిమనాలు సొంతం చేసుకుంటున్నానని పేర్కొంది. మూవీ లవర్స్ నుంచి ప్రేమను అందుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా మాట్లాడుతూ.. "నేషనల్ క్రష్ టైటిల్ తన మొదటి సినిమా కిరిక్ పార్టీ (2016) తో ప్రారంభమైంది. అంతకంటే ముందు, కాలేజ్ రోజుల్లో నేను చాలా మందికి క్రష్‌ని, తరువాత అది కర్ణాటక క్రష్‌గా, చివరికి నేషనల్ క్రష్‌గా మారాను. ఈ రోజు ప్రేక్షకులందరూ నన్ను అమితంగా ఇష్టపడటం చూస్తుంటే 'నేషనల్‌ క్రష్‌' అనే దశ నుంచి ముందుకు వచ్చినట్లు ఉంది' అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Rashmika Mandanna reacts to the National Crush tag and calls her fans cute

ఇప్పుడు తాను ప్రేక్షకుల అందరిలో గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాననీ, నేషనల్ వైడ్ గా ఇలా గుర్తింపు పొందడం తనాకెంతో ప్రత్యేకంగా అనిపిస్తుందని పేర్కొంది. అలాగే.. ప్రేక్షకుల జీవితాల్లో భాగమైపోయాననిపిస్తుందని రష్మిక ఆనందం వ్యక్తం చేశారు. అలాగే.. యేసు బాయి పాత్ర చేయడం చాలా ప్రత్యేకమైన అనుభూతి అని, తొలుత ఈ అవకాశం వచ్చినప్పుడు ఆశ్చర్యపోయానని చెప్పారు.ఇలాంటి పాత్ర చేయడం జీవితాంతం గుర్తిండిపోతోందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X