దర్శకుడి తీరుతో షాక్.... సెట్స్‌లో ఏడ్చేసిన హీరోయిన్ రష్మిక!
ఛలో, గీత గోవిందం, దేవదాస్ లాంటి వరుస విజయాలతో టాలీవుడ్ చిత్ర సీమలో కన్నడ బ్యూటీ రష్మిక దూసుకెళుతోంది. ఆమె నటించిన 'గీత గోవిందం' మూవీ రూ. 100 కోట్లు వసూలు చేయడంతో డిమాండ్ మరింత పెరిగింది. వరుస కమిట్మెంట్లు ఇస్తూ తన కెరీర్‌ను మరింత బలంగా బిల్డ్ చేసుకుంటోంది. తన ప్రియుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ కూడా రద్దవ్వడంతో తన పూర్తి ఫోకస్ సినిమాలపైనే పెట్టింది. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనను దూరం పెట్టిన ఈ బెంగుళూరు బ్యూటీ.... ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'గీత గోవిందం' సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు.

సెట్స్‌లో ఊహించని అనుభవం
రష్మిక ఎక్కడ అడుగు పెట్టినా సందడి వాతావరణం ఉండాల్సిందే. సెట్స్‌లో చలాకీగా కలియతిరుగుతూ అందరితో సరదాగా గడపటం అంటే ఆమెకు ఇష్టం. గీత గోవిందం, దేవదాస్ ఆడియో వేడుకల్లో రష్మిక చేసిన సందడి అంతా ఇంతా కాదు. అయితే ‘గీత గోవిందం' సినిమా సమయంలో కర్నాటక పాపకు ఊహించని అనుబవం ఎదురైంది.

సెట్స్‌లోనే ఏడ్చేసింది
ఓసారి ‘గీత గోవిందం' షూటింగుకు రష్మిక కాస్త ఆలస్యంగా వెళ్లింది. దీంతో ఆమెతో యూనిట్ సభ్యులు ఎవరూ మాట్లాడలేదట. తాను పలకరించినా పట్టించుకోక పోవడంతో.... ఓ మూలకు కూర్చుని ఏడ్చేసిందట. నాతో ఎవరైనా నవ్వుతూ మాట్లాడకపోతే చాలా ఇబ్బంది పడతాను, ఆ రోజు అందరూ అలా ప్రవర్తించడంతో ఏడుపొచ్చింది అని రష్మిక తెలిపారు.

దర్శకుడు కావాలనే చేశాడు...
అయితే ఆ రోజు రష్మికతో సెట్లో అందరూ అలా ప్రవర్తించడం అంతా దర్శకుడు పరశురాం చేసిన సెటప్పేనంట. రష్మికను ఆట పట్టించడానికే అలా చేశారట. ఎవరూ మాట్లాడక పోతే ఆమె ఎలా రియాక్ట్ అవుతారో అని టెస్ట్ చేశారట. రష్మికకు తెలియకుండా ఇదంతా ఓ కెమెరాలో రికార్డ్ చేశారు కూడా. తనను కెమెరా ఫాలో అవుతున్న విషయం దర్శకుడు చెప్పే వరకు తనకు తెలియలేదని రష్మిక తెలిపారు.

రష్మిక సినిమాలు
రష్మిక సినిమాల విషయానికొస్తే.... విజయ్ దేవరకొండతో ఆమె మరోసారి ‘డియర్ కామ్రేడ్' అనే సినిమాలో కనిపించబోతోంది. దీంతో పాటు వెకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ అనే చిత్రంలో నటిస్తోంది. ‘యజమాన' అనే కన్నడ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications











