విజయ్ సినిమాను రిజక్ట్ చేసిన రష్మిక.. షాక్‌లో సినీ ప్రియులు.. అసలు విషయం ఇదే

రష్మిక మందన్నా.. అందం, అభినయంతో రాణిస్తున్న హీరోయిన్. సైలెంటుగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చినా.. ఇప్పుడు వ‌ర‌స సినిమాల‌తో బిజీ అయిపోయింది. ఇటీవల విజయ్ దేవరకొండతో 'డియర్ కామ్రేడ్' అనే సినిమా చేసింది. ఇది మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. ఇందులో రష్మిక నటను మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఆమె చేసిన లిల్లీ అనే క్యారెక్టర్ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ క్రమంలోనే ఆమె వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది.

తాజాగా ఆమె ఇళయదళపతి విజయ్ సరసన నటించే అవకాశాన్ని వదులుకున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఫుట్ బాల్ క్రీడ నేపథ్యంలో సాగే చిత్రంలో నటిస్తున్నాడు. నయనతార హీరోయిన్. అట్లీ, విజయ్ కాంబినేషన్ లో ఇదివరకే మెర్సల్, తేరి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు విడుదలయ్యాయి. 150 కోట్ల నిర్మాణ వ్యయంతో దళపతి 63 చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మెర్సల్ చిత్రంలో వైద్యరంగంలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టిన అట్లీ ఈ చిత్రం ద్వారా క్రీడారంగంలోని రాజకీయాలపై అస్త్రం సంధించబోతున్నట్లు తెలుస్తోంది.

Rashmika Mandanna Reject Vijay 64 Movie

ఈ సినిమా తర్వాత విజయ్ నటించే 64వ సినిమాలో రష్మికను తీసుకోవాలని అనుకున్నారట. ఈ సినిమాను లోకేష్ కనకరాజ్ తెరకెక్కించనున్నారు. మొదట ఇందులో రష్మికను తీసేశారని అనుకున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆమెనే తప్పుకుందట. ప్రస్తుతం రష్మిక.. మహేశ్ సరసన 'సరిలేరు నీకెవ్వరు'తో పాటు నితిన్‌తో 'భీష్మ' అనే సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.

మరోవైపు, నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' సినిమా హిందీ రీమేక్‌లో హీరోయిన్‌గా రష్మికను తీసుకుంటున్నారని ఇటీవల ఓ వార్త బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ సినిమాలో ఆమెను తీసుకోడానికి విజయ్ దేవరకొండ కారణం అని కూడా ప్రచారం జరిగింది. ఇటీవల ముంబైలో 'డియర్ కామ్రేడ్' స్పెషల్ స్క్రీనింగ్‌కు వెళ్లిన సమయంలో విజయ్ దేవరకొండతో.. కరణ్ జోహార్‌ 'జెర్సీ' రీమేక్ విషయం చర్చించాడట. అప్పుడు హీరోయిన్‌గా రష్మికను సూచించాడట విజయ్. దీనికి కరణ్ కూడా ఓకే చెప్పేసినట్లు ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X