Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
దొంగతనం చేస్తూ అడ్డంగా బుక్కైన రష్మిక మందన్న.. కర్రతో ఆంటీ ఎటాక్!
ఛలో సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. ఏ క్షణంలో ఇక్కడ అడుగు పెట్టిందో తెలియదు గాని వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఫెయిల్యూర్స్ కి తన దగ్గర స్థానం లేదన్నట్లుగా బాక్సాఫీస్ హిట్స్ తో స్టార్ హీరోలను ఎట్రాక్ట్ చేస్తోంది. దాదాపు ఈ బ్యూటీ లక్కీ గర్ల్ లా మారిపోయింది. స్టార్ హీరోలు చాలా వరకు రష్మిక మందన్న వైపే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇటీవల సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేసిన ఈ బ్యూటీ తన చిన్న తనంలో చేసిన అల్లరి పనుల గురించి వివరణ ఇచ్చింది.
గోల్డెన్ గర్ల్..
రష్మిక మందన్న మొదటి సినిమా ఛలో ఏ స్థాయిలో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఆ తరువాత గీత గోవిందం సినిమాతో బ్యూటీ రేంజ్ మరో లెవెల్ కి వెళ్లిపోయింది. వరుసగా అవకాశాలు అందుకుంటూ మహేష్ బాబుతో కూడా సక్సెస్ అందుకుంది. ప్లాప్ లో ఉన్న నితిన్ కూడా రష్మిక తో భీష్మ సినిమా చేసి హిట్టు కొట్టాడు. దీంతో అమ్మడు గోల్డెన్ గర్ల్ అనే బ్రాండ్ సెట్ చేసుకుంది.
నెటీజన్స్ తో చాటింగ్..
సోషల్ మీడియాలో మేడమ్ గారు చాలా బిజీగా ఉంటారు. సినిమాలకు సంబంధించిన విశేషాలే కాకుండా తన పర్సనల్ లైఫ్ విషయాల గురించి కూడా ఎప్పటికప్పుడు ఆడియెన్స్ తో షేర్ చేసుకుంటోంది. అప్పుడప్పుడు తన సోషల్ మీడియా ఎకౌంట్ లను ఫాలో అయ్యే వారి సందేహాలకు అమ్మడు లైవ్ లోనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటుంది.
దొంగతనం..
అలాగే ఇటీవల రష్మిక తన చిన్ననాటి జ్ఞాపకాల గురించి ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది. చిన్నప్పుడు ట్యూషన్ కి వెళుతుండగా నేను నా ఫ్రెండ్ ఒక తోట దగ్గర మామిడి పళ్ళు దొంగలించడానికి ప్రయత్నం చేశాము. అయితే అక్కడే తోటకు కావలిగా ఉన్న ఒక ఆంటీ మమ్మల్ని చూసి కర్రతో దాడి చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ మేము వేగంగా పరిగెత్తి అక్కడి నుంచి తప్పించుకున్నామని రష్మిక వివరణ ఇచ్చింది.
Recommended Video
సౌత్ లో బిజీ బిజీగా..
సౌత్ ఇండస్ట్రీలో బాషా బేధం లేకుండా రష్మిక మందన్న చాలా బిజీగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. తెలుగులో అయితే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో కూడా రష్మిక ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో ఈ బ్యూటీ రామ్ చరణ్ కి జోడిగా నటించనుంది. అలాగే కన్నడ, తమిళ్ లో కూడా మరికొన్ని సినిమాలతో బిజీగా ఉంది.