Pushpa 2: నేషనల్ క్రష్ షాకింగ్ రెమ్యునరేషన్.. పుష్ప 2 కు రష్మిక ఎన్ని కోట్లు తీసుకొన్నదంటే?
Rashmika Mandanna: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 (ద పుష్ప ది రూల్). పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన పుష్ప 2 మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీలో నేషనల్ క్రష్ హీరోయిన్ రష్మిక మందాన నటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మూవీ నటించడానికి రష్మిక ఎంత పారిదోషకం తీసుకున్నదనేది హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ పుష్ప 2 కు రష్మిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే?
అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 1 ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇండస్ట్రీలోని పలు రికార్డులను తిరగరాస్తూ బన్నీ కెరీర్లో ది బెస్ట్ మూవీ గా నిలిచింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న సినిమానే పుష్ప 2. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందాన హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ అయినా బన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు.

బన్నీ - సుకుమార్ కాంబినేషన్లో వస్తున్నా మూవీ అంటేనే భారీ అంచనాలు నెలకొంటాయి. అలాంటివి వారి కాంబినేషన్ లో వస్తున్న స్పెషల్ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ కు ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటి పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల నటించింది. అల్లు అర్జున్తో కలిసి మాస్ స్టెప్పులు వేసింది. ఇలా బన్నీ శ్రీ లీలలు మాస్ స్టెప్పు లేస్తే.. ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
పుష్ప 2 మూవీ విడుదలకు ముందే ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తుంది. కోట్లాదిమంది ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 11, 500 స్క్రీన్ లో విడుదల కానుంది. ఇక ఈ మూవీ రన్ టైం విషయానికొస్తే దాదాపు మూడు గంటల 10 నిమిషాల వరకు ఉంటుందని సమాచారం. ఇక పుష్ప 2 బడ్జెట్ వివరాలకు వెళ్తే.. ఈ మూవీని నిర్మించడానికి దాదాపు 500 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా ఇలాంటి లోపాలు లేకుండా తీసినట్లు తెలుస్తోంది. ఒక ఫైట్ సీన్ కోసమే దాదాపు 60 కోట్లు ఖర్చు పెట్టారంటే ఏ రేంజ్ లో మూవీని తెరకెక్కించబోతున్నారనేది అర్థం అవుతోంది.

ఇక రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ నటించడానికి దాదాపు మూడు వందల కోట్లు తీసుకున్నారట. అత్యధిక కానీ, ఇక ఈ మూవీలో ప్రధాన ప్రధాన పాత్ర బన్వర్ సింగ్ షెకావత్. ఈ పాత్రలో నటించిన పహాద్ ఫాజిల్ కు కేవలం ఏనుంది కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించారట. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందాన రెమ్యునరేషన్ విషయానికొస్తే..పుష్ప సిరీస్ లో రష్మిక మందాన శ్రీ వల్లి పాత్రలో నటిస్తుంది. శ్రీ వల్లి పాత్రకు నేషనల్ క్రష్ ప్రాణం పోసిందని చెప్పాలి. తన అందం,అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇక పుష్ప 2 లో నటించడానికి రష్మిక మందాన దాదాపు 10 కోట్ల పారిదోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. పుష్ప 1 కేవలం మూడు కోట్లు తీసుకున్న ఈ . ఆ తర్వాత వచ్చిన యానిమల్ లో నటించిన నాలుగు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. తాజాగా పుష్ప 2 మూవీ కోసం ఏకంగా 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని టాప్ హీరోయిన్ జాబితాలో చేరింది. ఇప్పటివరకు నయనతార, దీపిక పదుకొనే, అలియా భట్, కరీనా కపూర్ తో సహా పలువురు హీరోయిన్స్ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారు.


Click it and Unblock the Notifications











