నన్ను తొక్కేయాలని అలాంటి కుట్ర జరుగుతోంది... బయటపెట్టిన రష్మిక మందన్న
కిర్రాక్ పార్టీ అనే చిన్న సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన రష్మిక మందన్న ఇప్పుడు నేషనల్ క్రష్‌గా ఎదిగారు. ఇంత షార్ట్ గ్యాప్‌లో నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కష్టంతో పాటు అదృష్టం కూడా తోడుగా నిలిచి రష్మికను ఈ స్థాయికి తీసుకెళ్లిందని విశ్లేషకులు చెబుతుంటారు. యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర వంటి వరుస బ్లాక్ బస్టర్లతో భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ హీరోయిన్‌కు లేని సక్సెస్ రేట్‌తో దూసుకెళ్తున్నారు రష్మిక మందన్న. అలాంటి ఆమెను తొక్కేయడానికి తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా బయటపెట్టడం చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది.
కిర్రాక్ పార్టీతో సినీరంగ ప్రవేశం
చదువు పూర్తి చేసిన తర్వాత కన్నడ సినీరంగంలో అడుగుపెట్టిన రష్మిక మందన్న.. కిర్రాక్ పార్టీ అనే ఓ చిన్నసినిమాలో నటించింది. ఆ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి ఆయనతో పెళ్లికి సిద్ధమై ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. కానీ ఏం జరిగిందో ఏమో కానీ రక్షిత్ శెట్టితో నిశ్చితార్ధం, వివాహం రద్దు చేసుకుని షాకిచ్చారు రష్మిక. ఆపై శాండిల్‌వుడ్‌ను వదిలేసి టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఛలో, భీష్మ, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ బ్రాండ్ ఏర్పరచుకున్నారు. ఈ దశలో పుష్ప సినిమాలో శ్రీవల్లిగా నేషనల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్నారు.

బాలీవుడ్‌లో స్టార్‌డమ్
ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టిన రష్మిక మందన్న .. యానిమల్ సినిమాతో తనలోని కొత్త కోణాన్ని చూపించారు. నటనతో పాటు బోల్డ్ సీన్స్‌లోనూ రెచ్చిపోయి నటించింది రష్మిక. ఆ తర్వాత పుష్ప 2, ఛావాలో రాణి యేసుభాయిగా నటించి మెప్పించారు. ఎంతోమంది హీరోయిన్స్ పోటీపడినప్పటికీ రష్మికకు ఈ హిస్టారికల్ రోల్ పోషించే అవకాశం దక్కింది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేరతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు రష్మిక.
క్రేజీ ప్రాజెక్ట్స్‌లో రష్మిక మందన్న
కుబేర సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక మందన్న ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్, థామా, కాక్‌టెయిల్ 2లో నటిస్తున్నారు. తన కష్టం, నటనకు తోడు దర్శక నిర్మాతలు, సహనటుల సహకారం, ప్రేక్షకుల అభిమానం, దేవుని ఆశీస్సులతో జీవితంలో ఈ స్థాయికి చేరుకున్నానని రష్మిక మందన్న పలుమార్లు తెలిపారు. తోటి మనుషులను గౌరవిస్తానని.. ఒక నటిగా నిత్యం ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటానని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలలో రష్మిక మందన్న మోస్ట్ వాంటెడ్ నటిగా మారారు.
డబ్బులిచ్చి ట్రోలింగ్ చేయిస్తున్నారు
అయితే రష్మికపై పలుమార్లు ట్రోలింగ్ జరుగుతుండటం చర్చనీయాంశగా మారింది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన్న దీనిపై స్పందించారు. తనపై ఓ ప్లాన్ ప్రకారం ట్రోలింగ్ జరుగుతోందని.. ఇందుకోసం కొందరు డబ్బులు కూడా ఇస్తున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మనుషులు ఎందుకంత క్రూరంగా మారుతున్నారో అర్ధం కావడం లేదని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. తనను ప్రేమించకున్నా పర్లేదని.. కానీ ఇలాంటి పనులు చేయొద్దని ఆమె హితవు పలికారు. ప్రస్తుతం రష్మిక మందన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రష్మిను తొక్కేయాలని కుట్ర చేస్తున్నదెవరు? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











