లవ్ ప్రపోజల్ ముందు ఎవరిది? రియల్ బాయ్‌ఫ్రెండ్‌ను అలా గుర్తించా? రష్మిక ఎమోషనల్
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్ఫణలో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్. విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి తదితరులు నటించారు.
ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహాి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫిని, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, రామకృష్ణ, మోనిక ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 7వ తేదీన గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్ రిలీజ్ ఆవిష్కరణ కార్యక్రమంలో రష్మిక తన మనోభావాలను పంచుకొంటూ..

బాయ్‌ఫ్రెండ్ ఎంచుకొనేటప్పుడు ఈ వ్యక్తి మనకు సరిపోతాడా? లేదా? అనే విషయాన్ని గుర్తించడానికి నా వద్ద సమాధానం లేదు. ఒక పర్సన్‌తో రిలేషన్‌లో ఉన్నప్పుడు మనమే అతడిలోని వాస్తవాలను గుర్తించాలి. మనతో అబద్దం ఆడకుండా ఉండే వ్యక్తి.. అతడిలో నిజాయితీని చూస్తే అర్ధమవుతుంది. లవ్, రిలేషన్ గురించి కరెక్టా? కదా? అనే విషయంపై పూర్తిగా చర్చించాలి. అప్పుడే అతడు కరెక్టా? కాదా? అనేది తెలుస్తుంది అని రష్మిక మందన్న అన్నారు.
బాయ్‌ఫ్రెండ్‌లో మీకు నచ్చే క్వాలిటీ ఎలాంటివి? మీకు నచ్చే విషయాలు ఏమిటి? అంటే.. రష్మిక మొహమాటపడ్డారు. అయితే విజయ్ దేవరకొండ లాంటి వాడు అంటూ అభిమానులు చెప్పడంతో.. అందరికి తెలిసి పోయింది అంటూ రష్మిక కామెంట్ చేశారు. అయితే ప్రపోజల్ విషయంలో విజయ్ దేవరకొండ నుంచే ముందు సమాధానం వచ్చింది అని యాంకర్ అంటే.. అంతే అంతే అంటూ రష్మిక కూడా జవాబు చెప్పారు.
ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా నాకు చాలా ప్రత్యేకం. నా సినిమాలు చూడటానికి వచ్చే ప్రేక్షకులు కొత్త అనుభూతిని పంచేలా ఉండే సినిమాలు నేను ఎంచుకొంటున్నాను. ఈ సినిమాలో భూమిక పాత్ర నా జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సినిమా కొత్త తరహా ప్రేమకథ. బెస్ట్ ఫ్రెండ్‌తో మాట్లాడుకొనే విషయాలను ఇందులో చూస్తారు. చాలాసార్లు లవ్ స్టోరీలను ఒకే కోణంలో చూపిస్తారు. కానీ ఈ చిత్రంలో డిఫరెంట్ యాంగిల్‌లో ప్రజెంట్ చేశారు అని రష్మిక మందన్న తెలిపారు.
ఇటీవల కర్నూల్‌లో జరిగిన బస్సు ప్రమాదం దుర్ఘటన తనను కలిచి వేసింది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకొన్న బాధితులకు సహాయం చేయలేకపోతున్నామనే బాధ నాకు కలుగుతుంది. ఈ ఘటన నన్ను తీవ్రంగా బాధిస్తున్నది అని అన్నారు. తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. మంచి కథలను ఎంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి సపోర్ట్ ఇవ్వాలి. నా జీవితంలో నా అభిమానులు అత్యంత ముఖ్యమైన వారు. వారి ప్రేమకు, అభిమానానికి రుణపడి ఉంటాను అని రష్మిక ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











