ధైర్యం చేశా.. ఇక ఆ జోలికి పోలేదు.. అసలు రహస్యం బయటపెట్టిన రష్మిక మందన్న

కన్నడ భామ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయింది. అందం దానికి తోడు అభినయం రెండూ ఉండటంతో ఆమెతో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు దర్శకనిర్మాతలు. కిరాక్ పార్టీ సినిమాతో తెరంగ్రేటం చేసిన ఈ భామ ఆ తర్వాత నాగశౌర్యతో కలిసి 'ఛలో' అంటూ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ వెంటనే విజయ్ దేవరకొండ సరసన 'గీతగోవిందం' చిత్రంలో ఆడిపాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన హోమ్లి లుక్స్‌తో ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌ని వలలో వేసుకొని సొంత అభిమాన వర్గాన్ని పోగు చేసుకుంది రష్మిక మందన్న. కొద్ది కాలంలోనే సహజంగా నటించడంలో దిట్ట అనే పేరు తెచ్చుకున్న ఈ భామ తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ అందుకు ఆ సహజత్వం తనకెలా సాధ్యమైందో చెప్పింది.

ఈ మేరకు సహజత్వం కోసం మీరేమైనా ప్రత్యేక కసరత్తులు చేస్తుంటారా అని అడగగా.. వెంటనే తన మనసు లోని మాటలను బయటపెట్టింది రష్మిక. మొదటి సినిమా చేసే వరకు కూడా తనకు నటనంటేనే తెలియదని, అప్పుడుడప్పుడూ స్కూల్ లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో డ్యాన్సులు మాత్రమే చేసేదాన్నని చెప్పుకొచ్చింది రష్మిక.

Rashmika Mandanna reveals Secret of her natural acting

అయితే ధైర్యం చేసి ఒకసారి ప్రయత్నించినా నటించలేకపోయానని.. ఇక అప్పట్నుంచి నటన జోలికి వెళ్లలేదని ఆమె పేర్కొంది. ''కానీ అప్పట్లో నటన తెలియకపోవడమే నాకు మేలైందేమో. తొలి సినిమా కోసం కెమెరా ముందుకొచ్చాక నాలా నేను కనిపించాలనుకొన్నా. నటన పేరుతో ప్రత్యేకంగా హావభావాలు కొని తెచ్చుకోకుండా సన్నివేశంలో ఉన్న ఇలాంటి సందర్భం నాకే ఎదురైతే ఎలా స్పందిస్తానని ప్రశ్నించుకొని అందుకు తగ్గట్టుగా నటించా. అదే నాలో ఒరిజినాలిటీని బయటికి తీసుకొచ్చింది. కాబట్టి నా పాత్రల్లో సహజత్వం వెనక అసలు రహస్యం అదే'' అని చెప్పింది రష్మిక.

ఇక రష్మిక అప్‌కమింగ్ ప్రాజెక్టులంటే.. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డియర్‌ కామ్రేడ్‌'లో విజయ్ దేవరకొండ సరసన అలాగే అల్లు అర్జున్‌, మహేష్‌బాబులతో కలిసి వారి వారి కొత్త సినిమాల్లో నటించనుంది రష్మిక.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X