ఆ హీరో నన్నలా పిలవడం ఏమాత్రం నచ్చలేదు.. రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కర్ణాటకకు చెందిన ఆమె తొలుత కన్నడ సినిమాల ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి తర్వాత తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించింది. తెలుగులో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న తర్వాత బాలీవుడ్ మీద దృష్టిపెట్టిన ఆమె ప్రస్తుతం బాలీవుడ్లో కూడా పలు సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె బాలీవుడ్ హీరో గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

సూపర్ హిట్ గా

సూపర్ హిట్ గా

కన్నడనాట కిరిక్ పార్టీ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన రష్మిక మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని, తర్వాత కన్నడ సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. ఆ సమయంలో వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చలో అనే సినిమాలో అవకాశం దక్కించుకున్న ఆమె మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత ఆమె చేసిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలుస్తూ వచ్చాయి.

రణబీర్ కపూర్ సరసన

రణబీర్ కపూర్ సరసన

గత ఏడాది పుష్ప సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న రష్మిక ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం రష్మిక తెలుగు, హిందీ, తమిళ భాషలలో వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. ఇప్పటికే రెండు బాలీవుడ్ సినిమాలు షూటింగ్ పూర్తి చేసిన రష్మిక మూడో బాలీవుడ్ సినిమా అయిన యానిమల్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె బాలీవుడ్ చాక్లెట్ బాయ్ గా పేరు పొందిన రణబీర్ కపూర్ సరసన నటిస్తోంది.

 టెన్షన్ పడ్డా

టెన్షన్ పడ్డా

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మనాలిలో జరిగింది. ప్రస్తుతం ముంబైలో రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది ఇటీవల ఓ మీడియా సంస్థతో యానిమల్ సినిమా షూటింగ్ కు సంబంధించిన విశేషాలు రష్మిక పంచుకుంది. ఈ సినిమాతోనే మొట్టమొదటిసారి రణబీర్ కపూర్ ను కలిశానని మొదటిసారి కలవడంతో ఆయనతో నటించబోతున్నాననే విషయంలో కాస్త టెన్షన్ పడ్డాను అని ఆమె పేర్కొంది.

మేడం అని పిలుస్తారు

మేడం అని పిలుస్తారు

నిజానికి ఆయన చాలా మంచి వ్యక్తి అయినా సరే మొదటిసారి కలిసినప్పుడు కాస్త భయం వేసింది అని ఆమె అన్నారు. అయితే సెట్ లో కలిసిన కొద్దిసేపటికే మా మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది అని సందీప్, రణవీర్ తో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉందని ఆమె తన అభిప్రాయాలూ వ్యక్తం చేసింది. అయితే రణబీర్ లో ఒక విషయం నచ్చదు అని, అదేమిటంటే రణబీర్ నన్ను మేడం అని పిలుస్తారు అని అన్నారు.

పాత్ర కీలకం

పాత్ర కీలకం

ఇప్పటివరకు సినీ పరిశ్రమలో నన్ను ఎవరైనా అలా పిలిచారు అంటే అది రణబీర్ ఒకరే అని ఆయన అలా పిలావడం నాకు ఇష్టం లేదని రష్మిక చెప్పుకొచ్చింది. యానిమల్ సినిమాను t-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను 2023 ఆగస్టు 11వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో రష్మీ గీతాంజలి అనే పాత్రలో నటిస్తోంది. అలాగే పుష్ప లో కూడా ఆమె పాత్ర కీలకం కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X