టాప్ హీరో సరసన రష్మిక.. లక్కీ ఛాన్స్‌తో దశతిరిగినట్లే!

తెలుగు యువతంతా ఇప్పుడు రష్మిక మందన జపం చేస్తున్నారు. గీత గోవిందం, ఛలో చిత్రాలతో రష్మిక మాయ చేసింది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో రష్మిక అవకాశాలు అందుకుంటోంది. తాజాగా రష్మిక గురించి వైరల్ అవుతున్న ఓ వార్త ఆసక్తిని రేపుతోంది. తమిళ స్టార్ హీరో విజయ్ సర్కార్ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తనకు మెర్సల్, తేరి లాంటి ఘనవిజయాలు అందించిన యువ దర్శకుడు అట్లీ తో విజయ్ మరోమారు జత కట్టబోతున్నాడు.

ఈ చిత్రంలో నటించే హీరోయిన్ల విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొదట నయనతార, సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం రష్మిక మందన ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇది రశ్మికకు క్రేజీ ఛాన్స్ అని చెప్పొచ్చు. విజయ్ సరసన నటిస్తే రష్మిక కెరీర్ కు మరింత బూస్ట్ లభించినట్లే.

Rashmika mandanna to romance with Vijay

ప్రస్తుతం రష్మిక తెలుగులో నితిన్ సరసన నటించేందుకు సిద్ధం అవుతోంది. మరికొందరు స్టార్స్ సరసన కూడా ఈ కన్నడ బ్యూటీకి అవకాశాలు దక్కుతున్నాయి. త్వరలో విజయ్ 63వ చిత్రం గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X