రోజులు చాలా కష్టంగా గడుస్తున్నాయి.. ప్లీజ్ రష్మిక.. క్రేజీ బ్యూటీ రియాక్షన్ చూస్తే!
'ఛలో' అంటూ టాలీవుడ్ గడపతొక్కిన కన్నడ భామ రష్మిక మందన్న అనతికాలం లోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది. వరుస అవకాశాలు పట్టేస్తూ సూపర్ ఫామ్‌లో ఉంది. స్టార్ హీరోలతో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసి యూత్ ఆడియన్స్ మనసు దోచేస్తోంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫ్రెష్ లుక్స్‌తో హల్చల్ చేయడం ఈ అమ్మడి స్టైల్.
సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉండే రష్మిక ఈ నెల 7వ తేదీ నుంచి సోషల్‌మీడియాకు కొంత దూరంగా ఉండటంతో ఆమె అభిమానులు నిరాశ చెందారు. దీంతో ట్విటర్ వేదికగా.. కమ్‌బ్యాక్ రష్మిక అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేశారు. 'రష్మిక ఆన్‌లైన్‌లోకి వస్తుందని వేచి చూస్తున్నాను', 'రష్మిక మేడమ్ ఎక్కడ ఉన్నారు? మీకు సంబంధించిన నోటిఫికేషన్స్ లేకపోవడంతో రోజులు నాకు చాలా కష్టంగా గడుస్తున్నాయి' అంటూ కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు.

ఇవి చూసిన రష్మిక.. వెంటనే క్రేజీగా రియాక్ట్ అయింది. 'క్షమించండి.. కానీ ఇప్పుడు నేను వచ్చేశాను' అంటూ అప్‌డేట్ ఇచ్చింది. దీంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇకపోతే ఇటీవలే ''సరిలేరు నీకెవ్వరు, భీష్మ'' సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ సినిమాలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











