Rashmika Mandanna: మైసా కోసం రష్మిక మందన్న సాహసం.. ఆ కొడవ బ్లడ్ అలాంటిది మరి!

ప్రేక్షకులను 3 గంటల పాటు థియేటర్‌లో కూర్చోబెట్టడానికి నటీనటులు ఎంతో శ్రమిస్తారు. సిక్స్ ప్యాక్ బాడీ, లేదంట జీరో సైజ్ కోసం కఠినమైన వర్కవుట్స్ చేస్తారు. ఇక షూటింగ్‌లో గాయపడి కాళ్లూ, చేతులు విరగ్గొట్టుకున్నవారితో పాటు ప్రాణాలు పొగొట్టుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. ప్రమాదమని తెలిసినా సరే ధైర్యంగా ముందడుగు వేస్తూ సినిమా పట్ల తమ అంకితభావాన్ని చాటుకుంటున్నారు. సీనియర్లే కాదు జూనియర్లు కూడా ఈ విషయంలో సమానంగానే కష్టపడతారు. తాజాగా అలాంటి సాహసమే చేశారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ వివరాల్లోకి వెళితే..

లవ్, రొమాంటిక్, ఫ్యామిలీ సినిమాలతో సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ నిర్మించుకున్న రష్మిక.. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు. నేషనల్ క్రష్‌గా ఆమె స్టార్‌డమ్ కారణంగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆచితూచి ప్రాజెక్ట్‌లు ఎంపిక చేసుకుంటూ తన మార్క్ చూపిస్తున్నారు రష్మిక. విజయ్ దేవరకొండతో తన సుదీర్ఘ ప్రేమాయణానికి చెక్ పెట్టి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. కొంతకాలం హనీమూన్‌లో ఎంజాయ్ చేసిన కొత్త జంట.. తర్వాత తమ రెగ్యులర్ షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు.

Rashmika Mandanna s Daring 80-Foot Jump for Mysa Stuns Fans

ప్రస్తుతం రష్మిక మందన్న హిందీలో కాక్‌టెయిల్‌ 2, తెలుగులో మైసా, రణబాలి సినిమాలో నటిస్తున్నారు. రణబాలిలో తన భర్త విజయ్ దేవరకొండకు హీరోయిన్‌గా నటిస్తున్నారు. చాలారోజుల తర్వాత విజయ్‌తో నటిస్తుండటం అది కూడా పెళ్లి తర్వాత తొలి మూవీ కావడంతో ఈ సినిమా కోసం సినీవర్గాలు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాక్‌టెయిల్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. జూన్ 9న ఈ సినిమా విడుదల కానుంది. ఈ షూటింగ్‌కు సంబంధించిన వివరాలను పంచుకుని రష్మిక ఎమోషనల్ అయ్యారు.

ప్రస్తుతం రష్మిక చూపంతా మైసా మీదే ఉంది. రవీంద్ర పూలే దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అన్‌ఫార్ములా ఫిలింస్ బ్యానర్‌పై అజయ్, అనిల్ సాయపురెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురు సోమసుందరం, ఈశ్వరి రావు, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం రష్మిక తీవ్రంగా కష్టపడుతున్నారు. యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ కావడంతో ఇంటర్నేషనల్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెచా ఖంపక్డీ పర్యవేక్షణలో రష్మిక శిక్షణ తీసుకుంటున్నారు. ఇటీవల బ్యాంకాక్‌ వారం రోజుల ప్రతిరోజూ 8 గంటల చొప్పున కఠినమైన యుద్ధ విద్యలను నేర్చుకున్నారట.

తాజాగా మైసా గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలోని అతిరపల్లి జలపాతం వద్ద జరుగుతోంది. ఇక్కడ కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు రష్మికపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారట. ఈ సందర్భంగా రష్మిక దాదాపు 80 అడుగుల ఎత్తు నుంచి దూకారట. దాంతో చేతులకు, కాళ్లకు గాయాలయ్యాట. అయినప్పటికీ ఏమాత్రం విరామం తీసుకోకుండా షూటింగ్ చేశారట. కేవలం 10 అడుగుల ఎత్తు నుంచి దూకడానికే హీరోలు డూప్‌లను అడుగుతున్నారని సినీరంగంలో బహిరంగంగానే చెప్పుకుంటున్న రోజుల్లో రష్మిక ఎలాంటి డూప్ లేకుండా స్వయంగా 80 అడుగుల భారీ ఎత్తు నుంచి దూకడం సినీ వర్గాలను, ఆమె అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇది సినిమా పట్ల రష్మికకు ఉన్న డెడికేషన్‌కు నిదర్శనమని వారు అంటున్నారు.

ఇదిలాఉండగా.. రష్మిక మందన్న కర్ణాటకలోని కొడవ కమ్యూనిటీకి చెందిన మహిళ అని తెలిసిందే. కొడవలు సహజంగానే యుద్ధవీరులు. క్షత్రియ వర్గానికి చెందిన కొడవలకు చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యలైన కత్తిసాము, కర్రసాము, గుర్రపుస్వారీని నేర్చుకుంటారు. పురుషులే కాడు.. కొడవలలో మహిళలు కూడా ధైర్యసాహసాలకు పెట్టింది పేరు. అలాంటి మూలాలకు చెందిన రష్మిక.. షూటింగ్‌లో ఎలాంటి రిస్కీ స్టంట్స్‌కు భయపడేది ఉండదని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X