నేను కోరుకునే వారితో మాత్రమే రొమాన్స్ చేస్తా.. రష్మిక మందన్న

కిరాక్ పార్టీ సినిమాతో తెరంగ్రేటం చేసిన కన్నడ భామ రష్మిక మందన్న.. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. నాగశౌర్యతో కలిసి 'ఛలో' అంటూ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ భామ.. విజయ్ దేవరకొండ సరసన 'గీతగోవిందం' చిత్రంలో ఆడిపాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ని వలలో వేసుకొని సొంత అభిమాన వర్గాన్ని పోగు చేసుకుంది. అయితే కెరీర్ పరంగా అడుగులేయడంలో మాత్రం సెలెక్టెడ్ గా ఉంటానంటోంది రష్మిక.

ప్రస్తుత తరుణంలో హీరోయిన్స్ అంటే అలా వచ్చి ఇలా వెళ్లిపోవడం కామన్ అయిపోయింది. కేవలం ఒకటో రెండో సినిమాలతోనే వారి కెరీర్ కి ఫుల్ స్టాప్ పడుతుండటం చూస్తున్నాం. ఈ సిట్యుయేషన్ తనకు రాకుండా కెరీర్ లాంగ్ టర్మ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తోంది రష్మిక. ఈ మేరకు చిన్న హీరోలతో సినిమాలు చేసేందుకు ససేమిరా నో అనేస్తోందట. కెరీర్ ఆరంభంలో చిన్న హీరోలతో చేసినప్పటికీ ఇకపై కేవలం స్టార్ హీరోలయితేనే ఓకే అనాలని డిసైడ్ అయిందట రష్మిక.

Rashmika Mandannas priority is only top heroes to romance

ప్రస్తుతం తన క్రేజీ జోడీ విజయ్ దేవరకొండ సరసన 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్న ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నా కూడా అన్నింటినీ ఒకే చేయడం లేదట. తనతో నటించే హీరో ఎవరనే విషయంలో ఆమె ప్రత్యేక శ్రద్ద పెడుతోందని అంటున్నారు. దర్శకనిర్మాతలు భారీ రెమ్మ్యూనరేషన్ ఆఫర్ చేసినప్పటికీ చిన్న హీరో అయితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే నో చెప్పేస్తోందట ఈ కన్నడ బ్యూటీ. దీంతో చేసేది లేక వెనుదిరగడమే సదరు దర్శకనిర్మాతల వంతవుతోందని సమాచారం.

ఇప్పటికే విజయ్ దేవరకొండకు సరైన జోడీ అని పేరుతెచ్చుకున్న ఈమె డియర్ కామ్రేడ్ సినిమాలో రెచ్చిపోయి నటించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ లో రష్మిక, విజయ్ దేవరకొండ లిప్ లాక్ ఇందుకు నిదర్శనం. ఇక తన తదుపరి చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో రొమాన్స్ చేసేందుకు ఓకే చెప్పింది రష్మిక. వీటితో పాటు పాటు పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించేందుకు కమిట్ అయింది. చూడాలి మరి రష్మిక అనుకున్నట్లు ఎంతమంది స్టార్ హీరోలతో ఆమె రొమాన్స్ చేస్తుందో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X