ఫ్రెండ్స్‌తో రష్మిక మందన్న బ్యాచిలర్ పార్టీ... ఆ హీరోయిన్ సడెన్ సర్‌ప్రైజ్!
కన్నడ కస్తూరి నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు 2025వ సంవత్సరం జీవితంలో ఎప్పటికీ ఓ తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఆమె కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఈ ఏడాది భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. రష్మిక నటించిన ఛావా, కుబేర, థామా, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన రష్మిక తనలోని నిజమైన నటిని ప్రపంచానికి పరిచయం చేసింది.
వరుస హిట్స్‌తో రష్మిక జోరు
ఇక సక్సెస్ ట్రాక్ పరంగా రష్మికకు కనుచూపు మేరలో ఏ హీరోయిన్ కూడా లేదంటే అతిశయోక్తి కాదు. వరుస హిట్స్‌తో బాలీవుడ్‌లో జైత్రయాత్ర సాగిస్తూ హిందీ భామలను వణికిస్తున్నారు రష్మిక. అటు వ్యక్తిగత జీవితంలోనూ రష్మికకు ఈ ఏడాది కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నారని గాసిప్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది రష్మిక - విజయ్‌లు సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. వీరి పెళ్లి తేదీపైనా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరి చేతికి ఉన్న రింగ్ మాత్రం అనేక రకాల అనుమానాలు కలిగిస్తోంది.

పెళ్లిపై రష్మిక వ్యాఖ్యలు
విజయ్ దేవరకొండతో పెళ్లిపై వస్తోన్న ఊహాగానాలపై రష్మిక మందన్న ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ వార్తలు ధ్రువీకరించలేను, అలాగని ఖండించలేను, పెళ్లి గురించి ఎప్పుడు బయటపెట్టాలో? ఎక్కడ మాట్లాడాలో? అప్పుడు ఖచ్చితంగా చెబుతానని జనాన్ని రష్మిక కన్‌ఫ్యూజన్‌లో పడేశారు. ఇక ది గర్ల్‌ఫ్రెండ్ సక్సెస్‌మీట్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన విజయ్ దేవరకొండ.. రష్మిక చేతిని ముద్దాడారు. అలాగే ప్రతి అమ్మాయి జీవితంలో విజయ్ లాంటి వ్యక్తి ఉండాలని రష్మిక ఆకాంక్షించారు. అలాగే తోటివారు సంతోషంగా ఉండాలని రష్మిక కోరుకుంటూ ఉంటారని విజయ్.. ఒకరిపై ఒకరు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
విజయ్ - రష్మిక పెళ్లి డేట్ ఇదేనా?
మరోవైపు.. విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరుగుతుందని రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎంగేజ్‌మెంట్‌ను సీక్రెట్‌గా జరుపుకున్న ఈ జంట.. పెళ్లిని మాత్రం గ్రాండ్‌గా జరుపుకుంటుందని అంటున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరినీ ఆహ్వానించాలని వీరు భావిస్తున్నారట. అలాగే హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ కూడా జరిగే అవకాశం ఉందని ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే రష్మిక, విజయ్‌లలో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే.
ఫ్రెండ్స్‌కి రష్మిక బ్యాచిలర్ పార్టీ
ఇదిలాఉండగా.. సినిమాలు, షూటింగ్స్ నుంచి కాస్త గ్యాప్ దొరకడంతో రష్మిక మందన్న తన స్నేహితులతో కలిసి శ్రీలంక ట్రిప్ వేశారు. అక్కడి బీచ్, రిసార్ట్స్‌లో చిల్ అయ్యారు. రష్మిక వెంట మరో హీరోయిన్ వర్ష బొల్లమ్మ, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. షూటింగ్‌లో కొంచెం గ్యాప్ దొరికింది, వెంటనే శ్రీలంకలోని అందమైన లోకేషన్స్‌కి నా గాల్ గ్యాంగ్‌తో వచ్చేశానని ఆమె రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా.. ఇది బ్యాచిలర్ పార్టీ అని.. విజయ్‌తో పెళ్లికి ముందు ఫ్రెండ్స్‌కి రష్మిక విందు ఇస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











