పెళ్లయిన నెలకే గుడ్‌న్యూస్? ముగ్గురం అయ్యామంటూ రష్మిక పోస్ట్ వైరల్
టాలీవుడ్ లవ్‌బర్డ్స్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు తమ సుధీర్ఘ ప్రేమాయణానికి తెరదించుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో తెలుగు, కొడవ సాంప్రదాయలను అనుసరించి విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు పెళ్లి చేసుకున్నారు. నాటి నుంచి ఈ జంట ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం హనీమూన్ కోసం ఫారిన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇదిలాఉండగా.. పెళ్లయిన నెల రోజులు కాకుండానే రష్మిక మందన్న- విజయ్ దేవరకొండలు గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఉదయ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న విరోష్ జోడీ... తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సంతోషంగా గడుపుతున్నారు. వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ప్రజలకు స్వీట్స్ పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విజయ్ దేవరకొండ పూర్వీకుల స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా బలమూరు మండలం తుమ్మన్‌పేటకు విజయ్- రష్మికలు విచ్చేసి సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు.

అలాగే అచ్చంపేట డివిజన్‌లోని 44 ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 9, 10 తరగతులు చదువుతున్న పిల్లల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో మార్కులు సాధించిన వారికి స్కాలర్‌షిప్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు విజయ్ దేవరకొండ. తర్వాత ఫిబ్రవరి 3వ తేదీన హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో అభిమానులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు విజయ్ - రష్మిక. అనంతరం మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు రిసెప్షన్‌లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తరలివచ్చారు.
అనంతరం విజయ్ - రష్మికలు హనీమూన్‌కు బయల్దేరి వెళ్లారు. ఇందుకోసం థాయ్‌లాండ్‌లోని కో సామ్యూయ్ దీవిలో ఎంజాయ్ చేస్తున్నారు. వీరి వెంట స్నేహితులు కూడా వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీనికి బడ్డీమూన్ అని పేరు. ఈ తరహా కల్చర్‌ను తెలుగువారికి పరిచయం చేసింది ఈ జంట. అలాగే ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నామో కూడా వీరిద్దరూ సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రశాంతమైన ఉదయాలు, స్విమ్మింగ్‌తో మధ్యాహ్నాలు, టేబుల్ టెన్నిస్, పూల్ గేమ్స్‌తో సాయంత్రాలు.. సినిమాలతో రాత్రిళ్లు గడిచిపోయిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను రష్మిక పంచుకున్నారు. తాజాగా రష్మిక మందన్న పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
ఇప్పుడు మేము ముగ్గురం అయ్యామని ఓ చిన్న యానిమేషన్ క్లిప్‌ని షేర్ చేశారు రష్మిక. అందులో రష్మిక మందన్న, విజయ్‌తో పాటు ఓ చిన్న పొద్దుతిరుగుడు పువ్వు కూడా ఉంది. రష్మిక టీ షర్ట్‌పై ఓ గుడ్డు పిక్ ఉండటంతో రష్మిక గర్భం దాల్చారా? పెళ్లయిన నెలకే గుడ్‌న్యూస్ చెప్పారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే దీని వెనుక వేరే కారణం ఉంది.. పొద్దు తిరుగుడు పువ్వును తొలి నుంచి స్నేహితురాలిగా భావిస్తుంది రష్మిక. అది ఎంతలా అంటే సదరు పొద్దుతిరుగుడు పువ్వు కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఖాతా కూడా ఓపెన్ చేసింది. ఆ పువ్వుతో కబుర్లు చెప్పుకుంటున్నట్లు, సరదాగా గడుపుతున్నట్లు అప్పుడప్పుడు యానిమేషన్ వీడియోలు, ఫోటోలు పంచుకుంటూ ఉంటారు రష్మిక. ఇప్పుడు విజయ్‌తో పెళ్లి కావడంతో ఈ యానిమేషన్ ప్రపంచంలోకి తన భర్తను ఆహ్వానిస్తూ.. ముగ్గురం అయ్యామనే ఉద్దేశంతో ఈ పోస్ట్ పెట్టారు. దాంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ .. విజయ్ - రష్మికలు తల్లిదండ్రులు కాబోతున్నారని అనుకునే వరకు వచ్చింది. తీరా అసలు విషయం తెలిసి వారంతా షాక్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications

















