twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా ఉండటమే నాకిష్టం.. కెమెరా ముందైనా అలాగే చేస్తా: రష్మిక మందన్న

    |

    తెలుగు తెరపై టాప్ హీరోయిన్ స్థాయిలో క్రేజ్ కొట్టేసి మంచి పాపులారిటీ తెచ్చుకుంది కన్నడ భామ రష్మిక మందన్న. ఛలో అంటూ పలకరించి గీతగోవిందం సినిమాతో యూత్ ఆడియన్స్ హృదయాలను దోచుకుంది. ఓ ప్రత్యేక ఫాలోయింగ్ కూడగట్టుకున్న రష్మిక వరుస సినిమాలకు కమిటవుతోంది. అవకాశాలు వెల్లువెత్తుతున్నప్పటికీ సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ కెరీర్ బిల్డ్ చేసుకొంటోంది ఈ కన్నడ బ్యూటీ.

    ఇప్పటికే విజయ్ దేవరకొండకు సరైన జోడీ రష్మికనే అనే పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ మరోసారి డియర్ కామ్రేడ్ రూపంలో ప్రేక్షుకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ రష్మిక, విజయ్ దేవరకొండ లిప్ లాక్స్ బాగా హైలైట్ కావడంతో ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. మొదట మే 31 వ తేదీనే విడుదల చేద్దామని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీని జులై 26 కు వాయిదా వేశారు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన రష్మిక సెట్స్ తానెలా మెదులుతాననే విషయాన్ని వెల్లడించింది.

    Rashmika Mandanna says her behaviour on the sets

    సినిమా షూటింగ్ సమయంలో చాలా శ్రద్దగా ఉంటూ సెట్స్ పై ఎవ్వరేం మాట్లాడినా శ్రద్దగా వింటానని అంటోంది రష్మిక. సెట్స్ పై ఉన్న ప్రతీ ఒక్కరినీ తనతో తెలుగులోనే మాట్లాడాలని చెప్పేదాన్నని, అలా అలా తెలుగు బాగా వంటపట్టిందని ఆమె పేర్కొంది. ఎవ్వరిది చెప్పినా వెంటనే మైండ్ లో ప్రింట్ గుద్దుకుంటానని, అందుకే తనకు ఇంత త్వరగా తెలుగు వచ్చేసిందని చెప్పింది. దర్శకులు చెప్పిన డైలాగ్స్ సహజంగా చెప్పడానికి ప్రయత్నిస్తా. బయట ఎలా ఉంటానో కెమెరా ముందు కూడా అలాగే ఉంటా. అదే పద్ధతి తనకు ఇష్టమని రష్మిక చెబుతోంది.

    ప్రస్తుత తరుణంలో హీరోయిన్స్ అంటే అలా వచ్చి ఇలా వెళ్లిపోవడం కామన్ అయిపోయింది. కేవలం ఒకటో రెండో సినిమాలతోనే వారి కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పడుతుండటం చూస్తున్నాం. ఈ సిట్యుయేషన్ తనకు రాకుండా కెరీర్ లాంగ్ టర్మ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తోంది రష్మిక. ఈ మేరకు కేవలం స్టార్ హీరోలయితేనే ఓకే అనాలని డిసైడ్ అయిందట రష్మిక. అందుకే తన తదుపరి చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో రొమాన్స్ చేసేందుకు ఓకే చెప్పింది ఈ భామ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. వీటితో పాటు పాటు పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించేందుకు కమిట్ అయింది రష్మిక.

    English summary
    Rashmika Mandanna is doing now Dear Comrade movie with Vijay Deverkonda. Their pair earlier in Geeta Govindam. Dear Comrade is set release in July. In latest interview She said her behaviour on the sets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X