Rashmika Mandanna: మాజీ బాయ్ ఫ్రెండ్స్ పై రష్మిక మందన్నా బోల్డ్ కామెంట్స్.. వారు కనిపిస్తే అంటూ
కన్నడ ముద్దుగుమ్మ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఛలో మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. మొదటి చిత్రంతోనే మంచి హిట్ అందుకుంది. దీంతో చూసి చూడంగానే నచ్చేశావే అంటూ తెలుగు యూత్ పాటలు పాడుకుంది. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసి నేషనల్ క్రష్ గా ఎదిగింది. ఇక ఇటీవల వచ్చిన పుష్ప సినిమాతో తన కెరీర్ మలుపు తిరిగింది. ఈ మూవీతో దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ ఆమెకు బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ కన్నడ అందం తన మాజీ బాయ్ ఫ్రెండ్స్ గురించి బోల్డ్ కామెంట్స్ చేసింది.

మంచి రెస్పాన్స్..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అందులో శ్రీవల్లిగా నటించి యూత్ ను ఫిదా చేసిందనే చెప్పవచ్చు. దీంతో ఆమెకు ఇటు బాలీవుడ్, అటు కోలీవుడ్ లో వరుసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఆమె నటించిన చిత్రం గుడ్ బై. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కుమార్తెగా నటించింది రష్మిక మందన్నా.

హిందీలో తొలిసారిగా..
గుడ్ బై మూవీ ట్రైలర్ చూస్తుంటే ఇందులో రష్మిక మందన్నా డిఫరెంట్ క్యారెక్టర్ చేసినట్లు తెలుస్తోంది. హిందీలో తొలిసారిగా నటించిన ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీ గ్లామర్ లుక్ లో కనిపించింది. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ ను బాగానే చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఈవెంట్లలో పాల్గొంటుంది రష్మిక మందన్నా.

రిలేషన్ గురించి పలు ప్రశ్నలు..
తాజాగా బాలీవుడ్ మీడియా అడిగిన ప్రశ్నలకు రష్మిక మందన్నా ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చింది. ఈ ఇంటర్వూలో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ తో తనకున్నరిలేషన్ గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి బోల్డ్ గా సమాధానాలు ఇచ్చింది ఈ నేషనల్ క్రష్. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ తో ఇప్పటికి తనకు మంచి రిలేషన్ షిప్ ఉందని తెలిపింది రష్మిక. వారు ఎదురుపడితే పలకరించేంత చనువు ఉందని పేర్కొంది.

కుటుంబాలతో కూడా..
తన మాజీ బాయ్ ఫ్రెండ్స్ తోపాటు వారి కుటుంబాలతో కూడా మంచి చనువు ఉందని చెప్పుకొచ్చింది ఈ బ్యూటి. అయితే ఇంతకీ రష్మిక మందన్నాకు ఎంతమంది మాజీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో మాత్రం చెప్పలేదు. అలాగే ఈ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండతో తన రిలేషన్ గురించి మాట్లాడటం క్యూట్ గా ఉందని లైగర్ మూవీ తనకు ఎంతో నచ్చిందని కూడా రష్మిక చెప్పన విషయం తెలిసిందే.

సూపర్ హిట్ అవడంతో..
ఇదిలా ఉంటే కన్నడ నాట 'కిరిక్ పార్టీ' అనే చిత్రం ద్వారా రష్మిక మందన్నా ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే అదే భాషల్లో ఎన్నో సినిమాలు చేసింది. ఆ సమయంలోనే హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం సాగించి నిశ్చితార్థం కూడా చేసుకుంది. తెలుగులో ఎంట్రీ ఇవ్వకముందే ఆమె మ్యారేజ్ ఫిక్స్ అయింది. నిశ్చితార్థం, మ్యారేజ్ కు ఉన్న గ్యాప్ లో టాలీవుడ్ కు ఛలో మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది.

ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకుని..
'ఛలో' మూవీతో తెలుగులో మంచి హిట్ కొట్టిన తర్వాత ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకుని షాకివ్వడంతో పాటు పాపులర్ అయింది రష్మిక. ఛలో' నుంచి మొదలుకొని 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి భారీ హిట్లను సొంతం చేసుకోవడంతో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. మధ్యలో కొన్ని పరాజయాలు వచ్చినా రష్మికకు స్టార్‌డమ్‌తో పాటు క్రేజ్ కూడా భారీ స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో దూసుకుపోతుంది ఈ కన్నడ భామ.


Click it and Unblock the Notifications











