ఆ బిజినెస్‌లోకి రష్మిక మందన్నా.. స్టార్స్‌ని మించిన స్ట్రాటజీతో నేషనల్ క్రష్

ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ లక్కీ ఎవరంటే టక్కున వినిపించే పేరు రష్మిక మందన్న. ఎక్కడో కర్ణాటకలోని మారుమూల ప్రాంతానికి చెందిన ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్‌గా వెలుగొందుతున్నారు. యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర సినిమాల వరుస హిట్స్‌తో ఇండియన్ స్క్రీన్‌పై రష్మిక ఇమేజ్ ఆకాశాన్ని తాకింది. దాంతో రష్మిక మందన్న తదుపరి సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లక్కీ హ్యాండ్‌గా మారడంతో ఆమె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారు. ఈ నేపథ్యంలో కెరీర్ పరంగా రష్మిక మందన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

క్రేజీ ప్రాజెక్ట్స్‌లో రష్మిక
కుబేర సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక మందన్న.. ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్, థామ సినిమాలలో నటిస్తున్నారు. వీటితో ముందుగా ది గర్ల్ఫ్రెండ్ సినిమా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రమోషనల్స్ కార్యక్రమాల్లో భాగంగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలో రష్మిక, దీక్షిత్ డ్యాన్స్‌తో భారీ హైప్ క్రియేట్ చేసింది. గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇది రష్మిక మందన్న కెరీర్‌లో తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీ.

Rashmika Mandanna Set To Launch Her New Business

లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో బిజీగా
దీనికి తోడు మైసా అనే కొత్త సినిమాలో తాను నటిస్తున్నట్లు రష్మిక అనౌన్స్ చేశారు. ఇందులో వారియర్ లుక్‌లో రక్తం నిండిన లుక్‌లో భయపెట్టారు రష్మిక. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. రష్మిక ఖాతాలో మరో మూవీ పడిందని అంతా అనుకుంటున్నారు. అలా కెరీర్ పరంగా ఎదురు లేకుండా దూసుకెళ్తున్నారు రష్మిక మందన్న. ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో రష్మిక రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొద్దినెలలుగా వార్తలు వస్తున్నాయి. రెస్టారెంట్‌లో, ఒకే కారులో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వీడియోల్ చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇద్దరూ తమ బంధాన్ని మాత్రం బయట పెట్టడం లేదు.

తెలివిగా పెట్టుబడులు
హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువన్న సంగతి తెలిసిందే. అందుకే దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకుంటున్నారు హీరోయిన్లు. సినిమాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌తో పాటు వ్యాపారాలు, పెట్టుబడులతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే రష్మిక మందన్న కూడా తన సంపాదనను తెలివిగా పెట్టుబడుల దిశగా మళ్లిస్తున్నారు. ఇప్పటికే పలు రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెడుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న నేపథ్యంలో అక్కడి వాతావరణం ఆమెకు గట్టిగానే పట్టిపడింది. బాలీవుడ్ హీరోయిన్లలో చాలా మంది వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు. ఇదే బాటలో నడవనున్నారు రష్మిక మందన్న.

వ్యాపారంలోకి రష్మిక
ఇటీవల తన తల్లితో ఆమె చేసిన సంభాషణలో వ్యాపారంలోకి దిగే అవకాశాలపై హింట్ ఇచ్చారు. అయితే అది ఏ వ్యాపారం అనేది మాత్రం రష్మిక చెప్పలేదు. నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుందని తల్లి కూడా హింట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రష్మిక ఏ వ్యాపారం చేయబోతున్నారు? ఏ సెక్టార్‌ను ఎంచుకున్నారు అనేది జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ రష్మిక బిజినెస్ చేస్తే మాత్రం పక్కా స్ట్రాటజీతో ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X