Rashmika Mandanna.. అమితాబ్‌తో అలాంటి అనుభవం.. షూటింగ్ సెట్లో విషయాలను చెప్పిన రష్మిక

దక్షిణాది గ్లామర్ హీరోయిన్ రష్మిక మందన్న కెరీర్ గ్రాఫ్ జోరుగా దూసుకెళ్తున్నది. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టేసి భారీ, క్రేజీ ప్రాజెక్టులతో హంగామా చేస్తున్నది. హిందీలో వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బాలీవుడ్ భామలకు షాక్ ఇస్తున్నది. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన అనుభవాలను రష్మిక పంచుకొన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ అనుభావాలను, అమితాబ్‌తో కలిసి నటించిన వర్క్ ఎక్సిపీరియన్స్, తన కెరీర్ గ్రాఫ్ గురించి వెల్లడిస్తూ..

టాలీవుడ్‌లో రష్మిక మందన్న లక్కీ మస్కట్‌గా మారిపోయింది. ధక్షిణాది చిత్ర పరిశ్రమలో పలు హీరోలకు మంచి విజయాలను అందించింది. విజయ్ దేవరకొండతో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకొన్నది. అలాగే తమిళంలో పలు చిత్రాల్లో నటించేందుకు ఒకే చెప్పింది. ఇలా దక్షిణాదిలో పాగా వేసిన రష్మిక ఏకంగా అమితాబ్ చిత్రంలోనటించే అవకాశం దక్కించుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Rashmika Mandanna shares Goodbye movie experience with Amitabh Bachchan

రష్మిక మందన్న కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో పుష్ప అనే ప్యాన్ ఇండియా మూవీలో నటిస్తున్నది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తుంది. అలాగే బాలీవుడ్‌లో మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాల్లో నటిస్తున్నది. సిద్దార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్ను, అమితాబ్ బచ్చన్‌తో గుడ్‌బై చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రం త్వరలోనే డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ కానున్నది.

ఇక అమితాబ్‌తో కలిసి నటించడం గొప్ప అనుభూతి. లెజెండ్‌తో కలిసి సుదీర్ఘంగా పనిచేయడంతో చాలా విషయాలు తెలుసుకొనే అవకాశం దక్కింది. ఆయనతో సన్నిహితంగా ఉండే అవకాశం నాకు దక్కడం పూర్వజన్మ సుకృతమే అని అనుకొంటాను. పాత్రకు తగినట్టుగా ఎలా ఫెర్ఫార్మెన్స్‌ చేయాలో అలాగే సెట్స్‌లో ఎలా సరదాగా ఉండాలి అనే విషయాన్ని ఆయన నుంచి నేర్చుకొంటున్నాను అని రష్మిక మందన్న తెలిపారు.

సెట్లో మనకు ఎదురుగా ఉండే నటులు, డైరెక్టుర్లు కంఫర్ట్‌గా ఉంటే చాలా సౌలభ్యంగా ఉంటుంది. దాంతో మనలోని ప్రతిభ కూడా బయటపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సెట్లో మధురానుభూతులను పొందడానికి ఛాన్స్ దక్కుతుంది అని రష్మిక అన్నారు.

ఇక రష్మిక కెరీర్ విషయానికి వస్తే... లాక్‌డౌన్‌కు ముందు రిలీజైన భీష్మ చిత్రంతో హిట్‌ను ఖాతాలో వేసుకొన్న కన్నడ భామ పలు చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన పొగరు కన్నడ చిత్రం తెలుగులో డబ్బింగ్ చిత్రంగా రిలీజైంది. ఈ మధ్యనే కార్తీతో కలిసి సుల్తాన్ సినిమాలో నటించింది. అయితే ఆ చిత్రం పెద్దగా ఆడకపోవడంతో తమిళంలో నిరాశే మిగిలింది. సుల్తాన్ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకోవడం తెలిసిందే. అలాగే ప్రస్తుతం ఆడాళ్లు మీకు జోహార్లు అనే తెలుగు చిత్రంలోనూ నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X