Rashmika Mandanna: ఆ విషయంలో నన్ను క్షమించండి.. నేషనల్ క్రష్ పోస్ట్ వైరల్

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందాన.. ఈ అమ్మడు నేషనల్ వైడ్ గా నెంబర్ వన్ హీరోయిన్ గా రాణిస్తోంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఈ అమ్మడు కెరీర్ పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న రష్మిక వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా మారింది. అయితే.. ఇటీవల రష్మిక జిమ్ లో గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా తన హెల్త్ అప్డేట్ ఇస్తూ.. క్షమాపణలు చెబుతూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టును సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆమె క్షమాపణలు చెప్పడానికి కారణమేంటో? అసలేం జరిగిందో మీరు కూడా ఓ లూక్కెయ్యండి.

రష్మిక మందాన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ కన్నడ భామ ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా తన హావా కొనసాగిస్తోంది. అలా అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప సినిమాలో శ్రీవల్లి అనే పాత్రలో ఒదిగిపోయింది రష్మిక. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఈ అమ్మడు నేషనల్ క్రష్ గా మారింది. ఇలా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ తరుణంలోనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' సినిమాలో నటించి తన అందాల ఆరబోతతో నేషనల్ క్రష్ గా మారింది.

Rashmika Mandanna shares her health and apologises to her film directors for delay post viral

ఇటీవల పుష్ప 2 సినిమా లో కూడా నటించింది. ఈ సినిమా ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రష్మిక మరోసారి వర్డల్ వైడ్ ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో 5 సినిమా సినిమాలు ఉన్నాయంట.

అందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్'సికిందర్' కాగా.. తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర సినిమాలలో కూడా రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుందట. మరో మూడు సినిమాల టైటిల్స్ ప్రకటించాల్సింది ఉంది. ఇలా వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. అయితే ఇటీవల రష్మిక మందాన తన జిమ్ లో వ్యాయామం చేస్తుండగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో ఈ అమ్మడు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకుంటుంది. దీంతో తాను నటిస్తున్న సినిమాల షూటింగ్స్ కు కాస్త అంతరాయం ఏర్పడింది. ప్రధానం గా
సల్మాన్ ఖాన్ 'సికిందర్' సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.

ఈ తరుణంలో నేషనల్ క్రష్ రష్మిక తన హెల్త్ అప్డేట్ ఇస్తూ.. ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. రష్మిక తన కుడి కాలుకి గాయమైనట్టు తెలుపుతూ పాదానికి కట్టుతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. రష్మిక తన పోస్ట్ లో ఇలా రాసుకోచ్చింది. న్యూ ఇయర్ గాయంతో మొదలైందని, అది ఎప్పుడు బాగుపడుతుందో తెలియక ఆందోళన పడుతున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం తాను ఆశావాదంతో ఉన్నాననీ, తన గాయం ఎన్నో వారాల్లో తగ్గుతుందో ఆ దేవునికి మాత్రమే తెలుసునని పేర్కొంది.

ప్రస్తుతం తాను థమ, సికందర్, కుబేర షూటింగ్ సెట్స్‌కి తిరిగి రావాలని ఆశిస్తున్నానని పేర్కొంది. అలాగే.. తన వల్ల ఆలస్యానికి దర్శక నిర్మాతలను క్షమించమని కోరుకుంటాన్నానని పేర్కొన్నారు. తాను రికవర్ అయిన వెంటనే తిరిగి వస్తానని రాసుకొచ్చింది రష్మిక మందన్న. రష్మికాకు గాయం అవ్వడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ బ్యూటీ రష్మిక మందాన త్వరగా కోలుకోవాలని, సాధ్యమైనంత త్వరలో షూటింగ్ లో పాల్గొనాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X