Rashmika Mandhana: అతడి జ్ఞాపకాల్లోనే రష్మిక మందన్న.. దాని కోసం తపన పడ్డానన్న శ్రీవల్లి
Rashmika Mandanna Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)- సెన్సెషనల్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప- 2 (Pushpa the Rule). పాన్ ఇండియా లెవెల్లో డిసెంబరు 5న విడుదల కాబోతున్న మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. విడుదల తేదీ దగ్గరికి వస్తున్న కొద్ది ప్రమోషన్లకు సిద్ధమవుతున్నారు మూవీ మేకర్స్. ఈ క్రమంలోనే పాట్నావేదికగా పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఫ్యాన్స్ కు తెలియజేస్తూ హీరోయిన్ రష్మిక మందన్న పుష్ప 1 సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఇంతకీ విషయాలేంటీ?
అల్లు అర్జున్- డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 1 ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సినిమా పుష్ప 2. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానున్నది. సీక్వెల్ మూవీలో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. భన్వర్ సింగ్ షెకావత్ అనే పవర్ఫుల్ పోలీస్‌గా ఫహాద్ ఫాజిల్ నటించారు. అలాగే.. ఈ మూవీకి స్పెషల్ ఎఫెక్ట్ అయిన ఐటమ్ సాంగ్ లో బన్నీతో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీ లీల మాస్ స్టెప్పులు వేసింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో బన్నీ శ్రీ లీలలు స్టెప్పులు వేస్తుంటే.. థియేటర్లు దద్దరిల్లి పోవాల్సిందేననీ ఫ్యాన్స్ సంబురపడుతున్నారు.

పుష్ప 2 విడుదలకు ముందే ఎన్నో రికార్డులను బ్రేక్ చేసి, నయా రికార్డులను క్రియేట్ చేసింది. ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్స్‌లో రిలీజ్ చేయనున్నారు. భారత్‌లో 6,500, ఓవర్సీస్‌లో 5,000 స్క్రీన్స్‌లో తీసుకురానున్నారు. ఇక పుష్ప 2 మూవీ రన్నింగ్ టైం విషయానికి వస్తే.. దాదాపు 3 గంటల 10 నిమిషాల వరకు నిడివి ఉంటుందని సమాచారం. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఇక నవంబర్ 17న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయడానికి మూవీ మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ మేరకు పాట్నాలో గ్రాండ్ గా ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ ను నిర్వహించాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారు.
పుష్ప 2 మూవీని దాదాపు రూ. 500 కోట్లు పెట్టి తీసినట్టు తెలుస్తోంది. ఈ పుష్ప 2 మూవీలో హైలెట్ నిలిచే.. గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ కోసం మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 60 కోట్లు వెచ్చించారట. ఫైట్ రిహార్సల్స్ కోసం మరో రూ. 14 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. ఇక పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగినట్టు తెలుస్తోంది. రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇందులోసినిమా థియేట్రికల్ రైట్స్ దాదాపు 600 కోట్లకు.. నాన్ థియేట్రికల్ హక్కులు 400 కోట్ల వరకు అమ్ముడుపోయినట్లు తెలిసింది. ఇక పుష్ప 2 ఓటీటీ హక్కులను 275 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా హీరోయిన్ రష్మిక మందాన ఇన్స్టాగ్రామ్ లో పలు ఫోటోలను షేర్ చేస్తూ.. పుష్ప 1 కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. అందులో ముందుగా పుష్ప 2 ట్రైలర్ త్వరలో విడుదల కాబోతుందంటూ తన ఫ్యాన్స్ కు తెలియజేసింది. తాను పుష్ప 1 సంబంధించిన విషయాలను ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎవరితో పంచుకోలేదనీ, అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానని తెలిపింది. ఈ ఫోటోలో శ్రీవల్లి ఫస్ట్ లుక్ టెస్ట్ ఫోటో, రష్యా లో అల్లు అర్జున్తో కలిసి దిగిన స్టిల్స్ , డైరెక్టర్ సుకుమార్ ప్రొడ్యూసర్స్ తో కలిసిన ఫొటోస్, నా స్వామి సాంగ్ మేకింగ్ వీడియో.. ఇలా పలు ఫోటోలు,వీడియోస్ ను షేర్ చేసింది. ఈ సమయంలో శ్రీవల్లి క్యారెక్టర్ సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని రిలీవ్ చేసింది. తాను శ్రీవల్లి క్యారెక్టర్ కోసం తిరుపతికి వెళ్లి కొంత రీసెర్చ్ చేశానని, శ్రీవల్లి క్యారెక్టర్ తిరుపతిలోనే మొదలైందంటూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసింది రష్మిక మందాన.


Click it and Unblock the Notifications











