Rashmika Mandanna: ఇక హ్యాపీగా రిటైర్ అవుతా.. నేషనల్ క్రష్ షాకింగ్ కామెంట్స్..
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందాన గురించి ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు నేషనల్ వైడ్ గా నెంబర్ వన్ హీరోయిన్ గా రాణిస్తోంది. అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఈ ముద్దుగుమ్మ కెరీర్ టర్న్ అయింది. ఒక్కసారిగా పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకుంది. వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా మారింది రష్మిక. ఇటీవల రష్మిక ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ. తన రిటైర్మెంట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. దీంతో ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఇంతకీ రష్మిక ఏమన్నాదంటే?
రష్మిక మందాన .. సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా తన హావా కొనసాగిస్తోంది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప సినిమాలో శ్రీవల్లి అనే పాత్రలో నటించి, మెప్పించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా కావడంతో ఈ అమ్మడు నేషనల్ క్రష్ గా మారింది. దీంతో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' సినిమాలో నటించి తన అందాల ఆరబోతతో నేషనల్ క్రష్ గా మారింది. ఇటీవల 'పుష్ప 2' సినిమా లో కూడా నటించింది. అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ.. సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమాతో రష్మిక వర్డల్ వైడ్ ఫ్యాన్స్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal)'చావా'(Chaava) సినిమాలో హీరోయిన్ నటిస్తోంది. ఈ మూవీకి లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వం వహించారు. ఈ మూవీని దివ్యంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్ నిర్మిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ముంబాయిలో 'చావా' ట్రైలర్ లాంచ్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ.. చావా సినిమా గురించి, తన పాత్ర గురించి తన అనుభవాన్ని పంచుకుంది. ఈ తరుణంలో రష్మిక తన ఫ్యాన్స్ ఆశ్చర్యపడేలా కామెంట్స్ చేసింది. చావా సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయిగా నటించే అవకాశం రావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాననీ, ఒక నటిగా ఇంతకు మించి ఏం కావాలన్నారు. తాను ఓ సారి డైరెక్టర్ లక్ష్మణ్ సర్ తో మాట్లాడుతూ.. ఇలాంటి పాత్ర నటించిన తర్వాత తాను రిటైర్ కూడా కావచ్చు అనుకుంటున్నానని చెప్పినట్టు గుర్తు చేసుకున్నారు. ఈ పాత్ర చాలా గొప్ప గా డిజైన్ చేశారనీ, చావా షూటింగ్ టైంలో ఎన్నో సార్లు భావోద్వేగానికి లోనయ్యానని రష్మిక అన్నారు.
ప్రస్తుతం రష్మిక కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక దీనిపై రష్మిక ఫ్యాన్స్ నిజంగానే ఈ సినిమా తర్వాత నేషనల్ క్రష్ రిటైర్మెంట్ తీసుకుంటుందా అంటూ షాక్ అవుతున్నారు. ఇక రష్మిక మందన్న అప్ కమ్మింగ్ మూవీస్ విషయానికి వస్తే.. హీరో ధనుష్, నాగార్జున అక్కినేని నటిస్తున్న 'కుబేర' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది కాకుండా.. బాలీవుడ్ కండాల వీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి 'సికందర్'లో రొమాన్స్ చేయడానికి సిద్దం అవుతోంది. ఈ మూవీ హిట్ అయితే.. నేషనల్ క్రష్ కు తిరుగు ఉండదనడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు.


Click it and Unblock the Notifications










