డైరెక్ట్‌గా రష్మిక ఇంటికి వెళ్లిన తెలుగు అభిమాని.. అలాంటి పని చేయడంతో హీరోయిన్ షాక్.. ప్లీజ్ అంటూ..
కన్నడ క్యూట్ గర్ల్ రష్మిక మందన్న గత కొంతకాలంగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. మెల్లగా సినిమా సినిమాకు తన రెమ్యునరేషన్ రేంజ్ ను పెంచుకుంటున్న ఈ బ్యూటీ అభిమానుల సంఖ్యను కూడా గట్టిగానే పెంచుకుంటోంది. అయితే ఇటీవల ఒక అభిమాని చేసిన పనికి రష్మిక షాక్ అయ్యింది. అలాంటి పనులు చేయకండి అంటూ ప్రాధేయపడింది.


గోల్డెన్ లెగ్
ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మిక మందన్న మొదటి నుంచి కూడా విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వస్తోంది. సినిమాలో తన పాత్ర హైలెట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్న ఈ మేడం కొంతమంది స్టార్ హీరోలకు గోల్డెన్ లెగ్ అయ్యిందని చెప్పవచ్చు. నితిన్ భీష్మ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రప్పించింది.

భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్
రష్మిక మందన్న సినిమాలపై ఇష్టంతో పెళ్లి విషయాన్ని కూడా పెద్దగా లెక్క చేయలేదు. వీలైనన్ని రోజులు స్టార్ డమ్ తో మంచి పాత్రలు చేయాలని టార్గెట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మెల్లగా స్టార్ హీరోలతో బిగ్ బడ్జెట్ సినిమాలు కూడా చేస్తున్న రష్మిక అభిమానుల సంఖ్యను కూడా గట్టిగానే పెంచుకుంటోంది.

900కిలోమీటర్లు నడిచి
ఇక అప్పుడప్పుడు అభిమానుల అతిప్రేమ సెలబ్రెటీలను కాస్త నిరాశకు గురి చేస్తుంటుంది. కొంతమంది ఇష్టంతో పాదయాత్రలు చేసి స్టార్స్ ఇంటికి వేకుతుంటాడు. ఇక రష్మిక కోసం కూడా ఒక తెలుగు అభిమాని కర్ణాకట వరకు నడుచుకుంటూ వెళ్లాడట. కానీ అప్పుడు ఆమె ఇంట్లో లేదు. షూటింగ్ కోసం ముంబైకి వెళ్లింది. ఇక అభిమాని దాదాపు 900కిలోమీటర్లు నడిచినట్లు తెలుస్తోంది.

దయచేసి అలాంటిదేమీ చేయవద్దు
ఇక ఆ విషయంపై స్పందించిన రష్మిక ఈ విదంగా వివరణ ఇచ్చింది. ' మీలో ఒకరు చాలా దూరం ప్రయాణించి నన్ను చూడటానికి ఇంటికి వెళ్ళారని నా దృష్టికి వచ్చింది .. ప్లీజ్
దయచేసి అలాంటిదేమీ చేయవద్దు.. నేను మిమ్మల్ని కలవలేదని బాధపడుతున్నాను. ఎదో ఒక రోజు మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి నాకు సోషల్ మీడియా ద్వారా ప్రేమ చూపిస్తే చాలు...సంతోషంగా ఉంటాను.. అని రష్మిక వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











