Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో పెళ్లి చేయాలనుకుంటున్నారు... రష్మిక మందన్నా షాకింగ్ కామెంట్స్
రష్మిక మందన్నా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ భామ పుష్ప సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్ గా మారిపోయింది. అయితే ఇటీవల ఈ భామ రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మందన్నా... విజయ్ దేవరకొండతో పెళ్లి గురించి స్పందించింది. తనకు విజయ్ కు పెళ్లి చేయాలని కొందరు అనుకుంటున్నట్లు షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...
ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన రష్మిక.. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ.. పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ముఖ్యంగా రష్మిక మందన్నా పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక ఈ భామకు సౌత్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.

ఇటీవల రష్మిక మందన్నా 'యానిమల్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ తో కలిసి నటించింది.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపు 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఓటీటీలోనూ ఈ సినిమా దుమ్మురేపుతుంది. విమర్శిస్తునే చాలా మంది ఈ సినిమాను చూస్తున్నారు. ఇక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, సిద్ధార్థ్ మల్హోత్ర గురించి మాట్లాడిన రష్మిక.. వారి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అమితాబ్ బచ్చాన్ వయసులో వ్యత్యాసం చూడకుండా అందరినీ ఒకేలా గౌరవిస్తారని చెప్పుకువచ్చింది. జీవితంలో ఏదైనా చేయగలననే నమ్మకాన్ని రణ్‌బీర్ ఇచ్చారని వెల్లడించింది. విజయ్ దేవరకొండ గురించి చెబుతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
నేను చేసే ప్రతి పనిలో విజయ్ సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పుకువచ్చింది. అతని సలహా తీసుకుంటా. అది నాకు అవసరం. ఏది మంచో, ఏది చెడో వివరిస్తారు. అలా చెప్పడం బాగుంటుంని తెలిపింది. వ్యక్తిగతంగా జీవితంలో అందరికంటే ఎక్కువగా సపోర్ట్ చేశారని కీలక వ్యాఖ్యలు చేసింది. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరగనుందని కొన్ని రోజుల క్రితం వార్తలు రావడంపై రష్మిక స్పందించింది.

విజయ్ దేవరకొండతో ఫిబ్రవరిలో నిశ్చితార్థం, పెళ్లి జరగడం లేదని క్లారిటీ ఇచ్చింది ఈ భామ. ప్రతీ రెండేళ్లకోసారి తనకు పెళ్లి చేయాలని కొన్ని మీడియా సంస్థలు భావిస్తున్నట్లు చెప్పుకువచ్చింది. వాళ్లు నా చుట్టూ తిరుగుతూ నేను కనిపిస్తే పెళ్లి చేయాలని చూస్తున్నారని ఫన్నీగా చెప్పుకువచ్చింది. ఏటా ఇలాంటి రూమర్ వింటూనే ఉన్నానని తెలిపింది. విజయ్ రష్మిక అప్పట్లో వెకెషన్లకు కలిసి వెళ్లడంతో.. వీళ్లు ప్రేమలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని పలు సందర్భాల్లో చెప్పుకువచ్చినా.. ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు.
ఇక రష్మిక మందన్నా సినిమాల విషయానికి వస్తే... లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో విక్కీ కౌశల్ తో చావా అనే సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవితాధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు, అల్లు అర్జున్ సరసన 'పుష్ప 2'లో కూడా నటిస్తుంది. అదే కాకుండా... 'రెయిన్ బో', 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రాలతో బిజీగా ఉంది. విజయ్ ప్రస్తుతం.. 'ఫ్యామిలీ స్టార్'లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











