మైండ్ బ్లాక్ చేసిన రష్మీక.. చిన్న వయసులోనే మ్యాగజైన్‌పై షాకింగ్ స్టిల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంటున్న హీరోయిన్ రష్మిక మందన్న. ఈ కన్నడ హీరోయిన్ ఛలో సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతో ఈ బ్యూటీ సక్సెస్ అందుకోవడమే కాకుండా ఓ వర్గం ఆడియేన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేసింది. ఇక సోషల్ మీడియాలో చురుగ్గా కనిపించే ఈ చిన్నది ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ పై చిన్నప్పుడే మెరిసింది.

Recommended Video

Rashmika Mandanna Childhood Magazine Picture Gone Viral
సోషల్ మీడియాలో బిజీగా..

సోషల్ మీడియాలో బిజీగా..

రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. అదే విధంగా హాట్ అండ్ క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ కి మంచి కిక్ ఇస్తుంటుంది. రష్మిక ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా వైరల్ అవ్వాల్సిందే. ఈ మధ్య మేడమ్ గారు తన చిన్నప్పటి ఫోటోలను కూడా బాగానే పోస్ట్ చేస్తున్నారు.

మ్యాగజైన్ బేబి..

మ్యాగజైన్ బేబి..

సాధారణంగా మ్యాగజైన్ లపై అప్పుడప్పుడు రష్మిక మందన్న హాట్ క్యూట్ లుక్స్ తో దర్శనమిస్తుంటుంది. ఆమె సినిమాల కోసం ట్రై చేస్తున్న సమయంలోనే మ్యాగజైన్ కోసం రష్మిక ఫోటో షూట్స్ లో పాల్గొంటూ ఉండేది. ఇక హీరోయిన్ గా సక్సెస్ అయినా తరువాత ఆ డోస్ ఇంకాస్త పెరిగింది. అయితే ఆమె మ్యాగజైన్ లకు స్టిల్స్ ఇవ్వడం ఎప్పుడో నేర్చుకున్నట్లు తెలుస్తోంది.

ఐదేళ్ల వయసులోనే..

ఐదేళ్ల వయసులోనే..

ఐదేళ్ల వయసులోనే రష్మిక అప్పట్లో ఒక ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజ్ కి స్టిల్ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోను రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. 2001లో జరిగిన ఫోటోషూట్ అని చెబుతూ.. అప్పటి నుంచి మా అమ్మ ఈ మ్యాగజైన్ ని దాచుకుందని.. ఇప్పటికీ ఇంకా దాచుకుంటూనే ఉందని రష్మిక స్వీట్ గా వివరణ ఇచ్చింది.

రాబోయే సినిమాలు..

రాబోయే సినిమాలు..

ప్రస్తుతం రష్మిక చిన్నప్పటి మ్యాగజైన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆ సినిమా కొత్త షెడ్యుల్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఇక కన్నడలో ఒక సినిమా రిలీజ్ కి ఉండగా తమిళ్ లో సుల్తాన్ అనే సినిమాను ఫినిష్ చేయడానికి రష్మిక ప్లాన్ చేసుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X