For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rashmika Mandanna: అతని గుండెలపై రష్మిక మందన్నా సంతకం.. హీరోతో చిందులు.. వీడియో వైరల్

  |

  నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి రష్మిక పుష్ప చిత్రంలో జోడి కట్టిన విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్, రష్మిక పేర్లు దేశవ్యాప్తంగా మారుమోగిపోయాయి. ఫలితంగా రష్మిక మందన్నాకు సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో సైతం విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇదిలా ఉంటే రష్మిక మందన్నా తాజాగా నటించిన చిత్రం ప్రమోషన్స్ కోసం ముంబైలో ఉంటోంది శ్రీవల్లి.

   అమితాబ్ కు కూతురిగా..

  అమితాబ్ కు కూతురిగా..


  నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అందులో శ్రీవల్లిగా నటించి యూత్ ను ఫిదా చేసిందనే చెప్పవచ్చు. దీంతో ఆమెకు ఇటు బాలీవుడ్, అటు కోలీవుడ్ లో వరుసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఆమె నటించిన చిత్రం గుడ్ బై. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కుమార్తెగా నటించింది రష్మిక మందన్నా.

  డీ గ్లామర్ లుక్ లో..

  డీ గ్లామర్ లుక్ లో..


  గుడ్ బై మూవీ ట్రైలర్ చూస్తుంటే ఇందులో రష్మిక మందన్నా డిఫరెంట్ క్యారెక్టర్ చేసినట్లు తెలుస్తోంది. హిందీలో తొలిసారిగా నటించిన ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీ గ్లామర్ లుక్ లో కనిపించింది. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ ను బాగానే చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఈవెంట్లలో పాల్గొంటుంది రష్మిక మందన్నా.

  తన గుండెలపై చేయమని..

  తన గుండెలపై చేయమని..

  అందుకోసం ముంబైలో ఉంటోంది రష్మిక మందన్నా. ఈ క్రమంలో రష్మికను చూసిన ఆమె ఫ్యాన్స్ రష్మికతో సెల్ఫీలు, ఫొటోగ్రాఫ్ లు, ఆటో గ్రాఫ్ లు తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గుడ్ బై ప్రోగ్రామ్ కోసం వెళ్లిన రష్మికను ఆమె ఫ్యాన్ ఆటోగ్రాఫ్ అడిగాడు. ఎక్కడ సంతకం చేయాలి అన్నట్లుగా రష్మిక చూడగా.. తన గుండెలపై చేయమని ఛాతి చూపించాడు ఆ అభిమాని.

  వీడియో వైరల్..

  మొదట అందుకు సందేహించిన రష్మిక మందన్నా తర్వాత వైట్ టీ షర్ట్ వేసుకున్న అతని గుండెలపై సంతకం చేసింది. రష్మిక సంతకం చేస్తుంటే ఆ అభిమాని మైమరిచిపోయినట్లుగా కనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టంట వైరల్ గా మారింది. ఇదంతా చూస్తుంటే రష్మిక మందన్నాకు నార్త్ ఆడియెన్స్ లో కూడా ఎంత పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు.

  డ్యాన్స్ షోకి రష్మిక..

  డ్యాన్స్ షోకి రష్మిక..


  అంతేకాకుండా ఆ మధ్య ముంబైలో ఒక గుడికి వెళ్లిన రష్మిక మందన్నాను అభిమానులు చుట్టుముట్టారు. అక్కడి నుంచి రోడ్డు మీదకు ఆమె కారు వచ్చేందుకు చాలా సమయం పట్టింది. ఒక దశలో తన ఫ్లైట్ మిస్ అవుతుందని రష్మిక కూడా అనుకుందట. ఇక ఇదిలా ఉంటే గుడ్ బై ప్రమోషన్స్ లో భాగంగా 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ సూపర్ మామ్స్' షోకి హాజరైంది రష్మిక మందన్నా. ఈ షోలో న్యాయ నిర్ణేతల్లో ఒకరిగా బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా వ్యవహరిస్తున్నారు.

  గోవిందాతో కలిసి స్టెప్పులు..

  గోవిందాతో కలిసి రష్మిక మందన్నా డ్యాన్స్ చేసింది. పుష్ప హిందీ వెర్షన్ లోని సామీ పాటకు గోవిందాతో కలిసి స్టెప్పులేసింది. సామీ అనే హుక్ స్టెప్ ను గోవిందా సైతం తనదైన శైలీలో వేసి ఆకట్టుకున్నాడు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా రష్మిక మందన్నా ఈ చిత్రంతోపాటు హిందీలో మరో సినిమాకు కూడా సైన్ చేసిన విషయం తెలిసిందే. హీరో సిద్ధార్థ్ మల్హోత్రా మిషన్ మజ్ను మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కోలీవుడ్ స్టార్ విజయ్ వారసుడు, పుష్ప 2 సినిమాల్లో కూడా అలరించనుంది రష్మిక మందన్నా.

  English summary
  National Crush And Pushpa Movie Heroine Rashmika Mandanna Signs An Autograph On Her Fan Chest And Dance With Senior Hero Govinda In Dance Show Video Goes Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X