నాకు యాక్టింగ్ రాదా? గద్దర్ అవార్డుల వేదికపై ఇచ్చి పడేసిన రష్మిక మందన్న

నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల కాలంలో కమర్షియల్ పాత్రలతో పాటు ప్రయోగాత్మక సినిమాల్లోనూ నటిస్తూ తనలోని నటిని నిరూపించుకుంటోంది. వివిధ ఛాలెంజింగ్ రోల్స్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.పుష్ప, పుష్ప 2, యానిమల్‌ వంటి చిత్రాలతో వరుస బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకుంది. పలు సినిమాల్లో నటిస్తున్న రష్మిక మందన్నా తనపై గతంలో వచ్చిన ట్రోల్స్ కు దీటుగా సమాధానం చెప్పింది. ఇంతకీ ఏమన్నారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మరోసారి తన నటనతో సత్త చాటింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (Gaddar Film Awards)వేదికపై 'ది గర్ల్ ఫ్రెండ్' చిత్రానికి గాను ఆమె ఉత్తమ నటి అవార్డును అందుకోవడం విశేషం. ఈ అవార్డు మాత్రమే కాకుండా, రూ.10 లక్షల నగదు బహుమతితో ఆమెను ఘనంగా సత్కరించడం ఈ ఘనతను మరింత ప్రత్యేకంగా నిలిపింది. విలక్షణ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాలో రష్మిక పోషించిన పాత్ర భావోద్వేగాలకు పెద్దపీట వేసింది.

Rashmika Mandanna Silences Trolls After Winning Best Actress Gaddar Film Awards

గ్లామర్‌కు దూరంగా, ఒక సాధారణ అమ్మాయి జీవితంలో ప్రేమ, బాధ, ఆత్మగౌరవం వంటి అంశాలను ఆమె ఎంతో సహజంగా ప్రదర్శించింది. సాధారణంగా కమర్షియల్ పాత్రలతో అలరించే రష్మిక, ఈ చిత్రంలో చూపిన మెచ్యూరిటీ జ్యూరీని బాగా ఆకట్టుకుంది. అందుకే పోటీలో పలువురు ప్రముఖ నటీమణులు ఉన్నప్పటికీ, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఆమెకే దక్కింది. మార్చి 19న ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హీరో రామ్ చరణ్ చేతుల మీదుగా రష్మిక ఈ అవార్డు అందుకుంది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా హాజరై వేడుకను మరింత వైభవంగా తీర్చిదిద్దారు.

ఈ సందర్భంగా రష్మిక చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 'ఒకప్పుడు నాకు యాక్టింగ్ రాదని ట్రోల్ చేశారు. కానీ ఇవాళ అదే నటనకు స్టేట్ అవార్డు వచ్చింది. ఇది నాకు చాలా స్పెషల్' అని చెప్పిన ఆమె మాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 'ది గర్ల్ ఫ్రెండ్' వంటి సినిమాలు చేయడానికి ధైర్యం ఇచ్చిందని, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.

ఇక వ్యక్తిగతంగా కూడా భావోద్వేగానికి లోనైన రష్మిక, 'ఇక్కడికి మొదట వచ్చినప్పుడు కూతురిలా ప్రేమ ఇచ్చారు, ఇప్పుడు మీ కోడలిగా మీ ముందు నిల్చున్నాను' అంటూ చెప్పిన మాటలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సందర్భంగా తన కుటుంబాన్ని చూసుకోవాలని అభిమానులను కోరడం మరో హైలెట్. మొత్తంగా చూస్తే.. ట్రోల్స్ నుంచి అవార్డ్స్ వరకూ రష్మిక ప్రయాణం ఒక ఇన్స్పిరేషన్‌గా నిలుస్తోంది. కమర్షియల్ సినిమాలతో పాటు పర్ఫార్మెన్స్ బేస్డ్ పాత్రలను కూడా ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది రష్మిక కెరీర్, రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X